iDreamPost
android-app
ios-app

భయ్యా సన్నీ యాదవ్‌ అమ్మాయిని వాడుకున్నాడు! ఫొటోలు బయటపెట్టాలా: అవినాష్‌

  • Published Mar 25, 2024 | 4:32 PM Updated Updated Mar 26, 2024 | 5:07 PM

Sunny Yadav, Avinash: యూట్యూబ్‌లో ట్రావిలింగ్‌ వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తూ.. ఓ ఇద్దరు య్యూటూబ్‌ ఇన్‌ఫ్లూయన్సర్లు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే మరో వీడియో వచ్చింది.

Sunny Yadav, Avinash: యూట్యూబ్‌లో ట్రావిలింగ్‌ వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తూ.. ఓ ఇద్దరు య్యూటూబ్‌ ఇన్‌ఫ్లూయన్సర్లు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే మరో వీడియో వచ్చింది.

  • Published Mar 25, 2024 | 4:32 PMUpdated Mar 26, 2024 | 5:07 PM
భయ్యా సన్నీ యాదవ్‌ అమ్మాయిని వాడుకున్నాడు! ఫొటోలు బయటపెట్టాలా: అవినాష్‌

యూట్యూబ్‌లో ట్రావెలింగ్‌ వీడియోలు చేసే అవినాష్‌, భయ్యా సన్నీ యాదవ్‌ మధ్య వివాదం ఇప్పట్లో సమసేలా లేదు. అవినాష్‌కు ‘నా అన్వేషణ’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. వివిధ దేశాల్లో పర్యటిస్తూ.. అక్కడి ప్రదేశాలను, పరిస్థితులను వివరిస్తూ.. ఆ ఛానెల్‌లో వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఉంటాడు. అలాగే భయ్యా సన్నీ యాదవ్‌ కూడా బైక్‌పై ట్రావెలింగ్‌ చేస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఉంటాడు. ఇద్దరు యూట్యూబ్‌పై ఆధారపడి సంపాదించే వాళ్లే. కానీ, ఇప్పుడు ఇద్దరికీ అస్సలు పడటం లేదు. ఇటీవల సన్నీ యాదవ్‌ తాను బైక్‌పై అమెరికాకు చేరుకున్నాను అని ఓ వీడియో చేశాడు. ఆ వీడియోపై స్పందించిన అవినాష్‌.. బైక్‌పై సన్నీ యాదవ్‌ వెళ్లాడని, బైక్‌ను షిప్‌లో పంపి, అతను విమానంలో వెళ్లాడంటూ విమర్శలు చేశాడు. దానికి సన్నీ యాదవ్‌ చాలా వైల్డ్‌గా రియాక్ట్‌ అవుతూ.. బుతులతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి గొడవ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే అవినాష్‌ మరో వీడియోను రిలీజ్‌ చేశాడు. ఈ సారి సన్నీ యాదవ్‌పై ఘటూ విమర్శలు, సంచలన ఆరోపణలు చేశాడు.

యూట్యూబ్‌లో వచ్చే డబ్బులు కాకుండా.. సన్నీ యాదవ్‌ అనే వ్యక్తి ట్రెడింగ్‌, బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రొత్సహిస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడని, అది చాలా పెద్ద తప్పని, బెట్టింగ్‌ యాప్స్‌ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, డబ్బు పోగొట్టకుని ఆత్మహత్య చేసుకున్నారని అవినాష్‌ అన్నాడు. అలాగే దొంగను దొంగ అంటే ఎందుకు చాలా మందికి కోపం వస్తుందని ప్రశ్నించాడు. సన్నీ యాదవ్‌ బైక్‌పై అమెరికా వెళ్లలేదు.. బైక్‌ను షిప్‌లో పంపి, అతను విమానం వెళ్లాడనే నిజాన్ని తాను చెప్పానని.. దాన్ని కాస్త తెలంగాణ యాసలో రోస్ట్‌ చేస్తూ సరదాగా ఒక వీడియో చేశానని, దానికే అతను పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడంటూ అవినాష్‌ పేర్కొన్నాడు. అది కేవలం సరదా కోసం, అందర్ని నవ్వించడానికి చేసిన వీడియో అని పేర్కొన్నాడు.

తనపై కూడా చాలా మీమ్స్‌ ఉన్నాయి. ఇలాంటి వాటిని సరదాగా తీసుకోవాలని అన్నాడు. ఈ క్రమంలోనే సన్నీ యాదవ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు అవినాష్‌. ‘ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అతను నన్ను వాడుకుని వదిలేశాడు. మీరే ఎలాగైనా కాస్త సెటిల్‌మెంట్‌ చేసి.. ఒక కోటి రుపాయలు ఇప్పించండి అంటూ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఫొటోలు, వివరాలు బయటపెట్టాలా’ అంటూ అవినాష్‌ తీవ్ర ఆరోపణలు చేశాడు. సన్నీ యాదవ్‌కు తనకు ఎలాంటి గొడవలు లేవని, జస్ట్‌ ఒక తప్పును తప్పని చెప్పాను అని అవినాష్‌ వీడియోలో పేర్కొన్నాడు. మరి అవినాష్‌ తొలుత చేసిన కామెంట్‌, దానికి సన్నీ బుతులతో ఇచ్చిన కౌంటర్‌.. ఇప్పుడు అవినాష్‌ రిలీజ్‌ చేసిన వీడియోస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetovis girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis