3 నెలల ఫ్రీ రీచార్జ్ అందిస్తోన్న మోడీ సర్కార్.. వాస్తమెంత..?

ఈ మధ్య కాలంలో ఏదీ ఫేక్, ఏదీ నిజం తెలిసి కోవడం కష్టంగా మారింది. సోషల్ మీడియా వచ్చాక.. ఆ డౌట్ మరింత పెరిగింది. ప్రతి మేసేజ్ నిజమని నమ్మి.. మోసపోతున్నారు. వీరు మోసపోయిందీ చాలకుండా.. పక్కన వాళ్లు కూడా మోసపోయేలా చేస్తున్నారు. ఇటువంటి న్యూస్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఈ మధ్య కాలంలో ఏదీ ఫేక్, ఏదీ నిజం తెలిసి కోవడం కష్టంగా మారింది. సోషల్ మీడియా వచ్చాక.. ఆ డౌట్ మరింత పెరిగింది. ప్రతి మేసేజ్ నిజమని నమ్మి.. మోసపోతున్నారు. వీరు మోసపోయిందీ చాలకుండా.. పక్కన వాళ్లు కూడా మోసపోయేలా చేస్తున్నారు. ఇటువంటి న్యూస్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం ఇది ఎన్నికల కాలం. ఇప్పటికే ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణతో పాటు చత్తీస్ గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇవి వచ్చే ఏడాది నిర్వహించే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ లాంటివి. ఈ ఎన్నికలు అధికారంలో ఉన్న బీజెపీ సర్కార్‌కు చాలా కీలకం కూడా. వీటి ఫలితాలను బట్టే వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు వ్యూహ రచనలు చేసే అవకాశం ఉంది. సుమారు దశాబ్ద కాలం క్రితం అధికారాన్నికోల్పోవడంతో పాటు పార్టీ ప్రాభవం కూడా క్షీణిస్తుండటంతో.. తిరిగి ఈ ఎన్నికల ద్వారా పుంజుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఓటర్లకు తాయిలాలు ప్రకటించే సమయం కూడా ఇదే.

ఈ సమయంలో ఇప్పుడు ఓ వాట్సప్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అదే వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాబోయే మూడు నెలల పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్రీ రీచార్జ్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజెపీకి ఓటు వేయనున్నారని, మళ్లీ బీజెపీ ప్రభుత్వం రాబోతుందంటూ.. ఓ లింక్ ఇస్తూ.. సోషల్ మీడియాలో వార్త నడుస్తుంది. తొలుత దీనికి చివర తేదీ అక్టోబర్ 31 అని రాగా, ఆ తర్వాత నవంబర్ నవంబర్ 16 చివరి తేదీ అంటూ ఆ మేసేజ్‌లో పేర్కొనబడి ఉంది. ఇక ఫ్రీ అంటే తెలిసిందే కదా.. తెగ షేర్లు చేసేస్తున్నారు. వాస్తమేమిటే తెలుసుకోకుండా.. కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారందరికీ ఫార్వార్డ్ కొట్టేస్తున్నారు.

బీజెపీ ఫ్రీ రీచార్జ్ యోజన కింద సాగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ప్రధాని మోడీ రాబోయే మూడు నెలలు ఫ్రీ రీచార్జ్ ఇస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ లింక్ ఫేక్ అని, అదంతా అసత్యపు ప్రచారమని తెలిపాయి. ఏదీ ఉన్నా.. ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటిస్తాయని వెల్లడించాయి. ఈ వదంతులను నమ్మొద్దని, ఫ్రీ రీచార్జ్ యోజన తెచ్చే అవకాశం లేదని స్పష్టం చేశాయి.

Show comments