Ziona Chana: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం.. 39 పెళ్లిళ్లు.. 84 మంది పిల్లలు

ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం.. 39 పెళ్లిళ్లు.. 84 మంది పిల్లలు

దేశంలో గతంలో బహుభార్యత్వం ఉండేది. పురుషుడు అనేక మంది మహిళలను వివాహం చేసుకునే వాడు. గంపెండు మంది పిల్లల్ని కనేవారు. అయితే ఆ తర్వాత న్యాయస్థానాలు, చట్టాలు ఏర్పడి ఏక పత్నీ వ్యవస్థ ఏర్పడింది. ఇక ఏం చేసేది లేక జీవిత భాగస్వామితో కాంప్రమైజ్ అయ్యి కాపురం చేసేవారు. లేదంటే భార్యకు తెలియకుండా అక్రమ, వివాహేతర సంబంధాలు నెరిపేవారు. భార్యకు తెలిస్తే విపత్కర పరిస్థితులకు దారి తీసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇక భార్యా భర్తల మధ్య గొడవలు ఏర్పడితే.. ఇద్దరు ఇష్టప్రకారం విడాకులు తీసుకుని.. మరో పెళ్లి చేసుకునే అవకాశాన్ని కల్పించాయి కోర్టులు. అయితే వ్యక్తిగత ఈగోలతో చాలా కేసులు కోర్టుల్లో సంవత్సరాలుగా నానుతున్నాయి. మరికొంత మంది యదేచ్ఛగా విడాకులు ఇచ్చి అనేక పెళ్లిళ్లు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. సెలబ్రిటీలకు ఇటువంటి వ్యవహారాలు కొత్తేమీ కాదూ.. కానీ మనం ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి మామూలోడు కాదూ.. ఒక భార్యనే తట్టుకోవడం కష్టం అనుకుంటే ఏకంగా 39 మందిని పెళ్లి చేసుకుని పెద్ద కుటుంబాన్ని పోషించాడు.

ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 39 మంది భార్యలు కూడా అన్యోన్యంగా కలిసి ఒకే  ఇంట్లో ఉంటున్నారు. ఇంతకు అతడి అడ్రస్ పెట్టమంటారా.. అతడిది ఈశాన్య రాష్ట్రంలోని మిజోరాం. బక్టోంగ్ తలంగ్నుమ్ అనే గ్రామంలో నివసిస్తోంది జియోనా చానా కుటుంబం. ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబాన్ని సృష్టించి.. ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు జియోనా చానా. కాగా, ఆయన 2021లో మరణించారు. ఈ 39 మంది భార్యల ద్వారా 89 మంది సంతానాన్ని పొందాడు. 36 మంది మనవళ్లు కూడా ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇంటికి చువాన్ థార్ రన్.. అంటే కొత్త తరం ఇల్లు అనే పేరు. ఆ ఇంట్లో అందరికీ సరిపడా 100 గదులు ఉన్నాయి. ఈ ఇంట్లో అతి పెద్ద వంట గది కూడా ఉంది. దాదాపు 180 మంది కుటుంబానికి భోజనం వండేవారు. రోజుకు 45 కిలోల బియ్యం, 30-40 కోళ్లు, 25 కిలోల పప్పుధాన్యాలు, డజన్ల కొద్దీ గుడ్లు వినియోగించేవారట.

ఈ విషయం తెలిసిన చుట్టు ప్రక్కల వారు ఆ ఇంటిని చూసేందుకు వచ్చేవారు. అలాగే దేశ వ్యాప్తంగా పలువురు ఆ ఇంటిని సందర్శించేవారు. చివరకు ఆ ఇల్లు ఓ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.  2021లో అనారోగ్య సమస్యలతో 76 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచాడు జియోనా. అతడి మృతి పట్ల ముఖ్యమంత్రి జోరాంతంగా తన సంతాపాన్ని వ్యక్తం చేశాడంటే.. అప్పటికే అతడు ఎంత ఫేమస్ అయ్యాడో తెలుస్తుంది. 1945లో పుట్టిన ఇతగాడికి.. 17 ఏళ్ల ప్రాయంలోనే తనకన్నా మూడేళ్లు పెద్దదైన మహిళను వివాహం చేసుకున్నాడు. అలా 39 పెళ్లిళ్లు చేసుకుని, ఇంత సంతానాన్ని కని చరిత్ర సృష్టించాడు. చన పాల్ అనే క్రైస్తవ వర్గానికి చెందిన ఈ కుటుంబం 2 వేల మంది అనుచరులు ఉండేవారు. జియోనా తాత 1942లో ఈ సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం బహుభార్యాత్వాన్ని అనుమతించింది. తాత అనుమతించినందుకో, అనుసరించాలనుకున్నాడో కానీ.. 39 పెళ్లిళ్లు చేసుకున్నాడు జియోనా.

Show comments