దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కాస్త తక్కువగానే కేసులు నమోదవుతున్నా రోజువారీగా చూసుకుంటే ఈ కేసుల్లో కూడా భారీ ఎదుగుదల కనిపిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో సామాన్యులనే కాక సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడి క్వారంటైన్ లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. సోమవారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి కూడా కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. హోం క్వారంటైన్‌లో ఉన్న బసవరాజ బొమ్మై తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వెల్లడించారు.
అలాగే సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, బృంద కారత్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారంతా ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. కొడాలి నాని స్నేహితుడు, తెలుగుదేశం నేత వంగవీటి రాధాకు సైతం కరోనా సోకింది. ఈ ఇద్దరూ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. గతంలో ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు కూడా కరోనా సోకిన సమయంలో కూడా అదే ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మంత్రి కొడాలి నాని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, రాధాకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఆయన ఆరోగ్యం కూడా బానే ఉందని వైద్యులు తెలిపారు.
Also Read : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంట్లో విషాదం, సాగర్ కాలువలో ప్రమాదం