iDreamPost
android-app
ios-app

Mega154 : వింటేజ్ లుక్ లో మెగా 154 ప్రారంభం

  • Published Nov 06, 2021 | 7:13 AM Updated Updated Nov 06, 2021 | 7:13 AM
  • Published Nov 06, 2021 | 7:13 AMUpdated Nov 06, 2021 | 7:13 AM
Mega154 : వింటేజ్ లుక్ లో మెగా 154 ప్రారంభం

సైరా నరసింహారెడ్డి తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చేసిన మెగా స్టార్ చిరంజీవి నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా మళయాలం లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ శరేవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందబోయే వేదాళం రీమేక్ భోళాశంకర్ వచ్చే వారం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ లోగా దానికన్నా ముందు ఇవాళ బాబీ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న చిరు హాజరుకాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు కానీ టైటిల్ రివీల్ చేయలేదు. వాల్తేరు వీరయ్య ఇప్పటికే ప్రచారంలో ఉంది.

పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో చిరుతో శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్, అందరివాడు లాంటి మ్యూజికల్ ఆల్బమ్స్ ఈ కాంబినేషన్ లో ఉన్నాయి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బాస్ మూవీకి దేవి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అనే అంచనాలు అభిమానుల్లో భారీగా ఉన్నాయి. ఈ మాస్ ఎంటర్ టైనర్ లుక్ లో చిరంజీవి ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. అప్పుడెప్పుడో ఆరాధన తర్వాత అలాంటి సముద్రపు రఫ్ క్యారెక్టరైజేషన్ ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు రేంజ్ మాస్ ని ఇందులో చూడబోతున్నామనే మెసేజ్ అయితే ఇచ్చారు.

ఇప్పుడు వీటిలో గాడ్ ఫాదర్ తర్వాత ముందు భోళా శంకర్ రిలీజ్ అవుతుందా లేక ఈ బాబీదా అనేది తెలియాల్సి ఉంది. హీరోయిన్ ఎవరో కన్ఫర్మ్ కాలేదు. మిగిలిన టెక్నికల్ టీమ్ ని కూడా ఇంకా ప్రకటించలేదు. నెక్స్ట్ లైన్ లో మారుతీ, సంపత్ నందిలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన స్టోరీ లైన్స్ నచ్చిన చిరు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఉంది కానీ నిజంగా చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఈ ఇద్దరూ తమ లేటెస్ట్ మూవీస్ మంచి రోజులు వచ్చాయి, సీటిమార్ లతో ఆశించిన ఫలితాలు అందుకోలేదు. వెతికి మరీ ఫామ్ లో లేని డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారన్న ఫ్యాన్స్ కామెంట్స్ కు చిరు బదులు చెప్పాల్సింది బ్లాక్ బస్టర్ల తోనే

Also Read : Mohan Lal : మోహన్ లాల్ నిర్ణయం ప్రకంపనలు రేపుతోంది

Jojobet GirişDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetJojobetMadridbetMadridbetgrandpashabetgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasinomilyoncasinomilyonultrabetgrandpashabet girişultrabetgrandpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet