iDreamPost
android-app
ios-app

‘మాస్టర్’ చెన్నై సెన్సార్ రిపోర్ట్

  • Published Jan 03, 2021 | 11:26 AM Updated Updated Jan 03, 2021 | 11:26 AM
  • Published Jan 03, 2021 | 11:26 AMUpdated Jan 03, 2021 | 11:26 AM
‘మాస్టర్’ చెన్నై సెన్సార్ రిపోర్ట్

గతంలో విజయ్ ఇమేజ్ తెలుగులో చాలా వీక్ గా ఉండేది. తమిళనాడులో అగ్ర తారగా వెలుగొందుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం సోసో మార్కెటే. తుపాకీ వచ్చాకే పరిస్థితిలో మార్పు వచ్చింది. అయితే గతంలో ఇతని బ్లాక్ బస్టర్స్ చాలామటుకు మనవాళ్ళు రీమేక్ చేయడం కూడా ఒకరకంగా చాలా మైనస్ అయ్యింది. కత్తిని కూడా డబ్బింగ్ చేయాలని విజయ్ అప్పట్లో గట్టిగా ప్రయత్నించాడు కానీ రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ రావడంతో నిర్మాత చిరంజీవి టీమ్ కు ఇచ్చేశాడు. అదిరింది, విజిల్ లు ఇక్కడ మరీ అద్భుతాలు చేయనప్పటికీ దానికైన బిజినెస్ కు తగ్గట్టు బయ్యర్లకు మంచి లాభాలు ఇచ్చాయి. ఖైదీతో పోటీని తట్టుకుని మరీ విజిల్ హిట్టు కొట్టింది.

ఇప్పుడు అందరి చూపు 13న రాబోయే మాస్టర్ మీదే ఉంది. సెన్సార్ పూర్తి చేసుకున్నాక దాని తాలూకు రిపోర్ట్ కోసం చెన్నై మీడియా వర్గాలు విపరీతంగా ప్రయత్నించాయి. అందులో కొంత మేర సక్సెస్ కూడా అయ్యాయి. దాని ప్రకారం వినిపిస్తున్నదేంటంటే మాస్టర్ లో ఒకటి రెండు కాదు ఏకంగా ఆరుకు పైగా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఇంటర్వెల్ బ్లాక్ ముందు నుంచి వచ్చి ఆపై ఇంకో లెవెల్ కు తీసుకెళ్లేలా దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసినట్టు తెలిసింది. రెండో సగంలో ఉక్కిరిబిక్కిరి చేసే రేంజ్ లో సన్నివేశాలు పడ్డాయని వినికిడి.

ఇది కనక నిజమైతే విజయ్ ఫ్యాన్స్ కు అంత కన్నా కావలసింది ఏముంటుంది. అసలే ఇక్కడ టాలీవుడ్ లో పండక్కు విపరీతమైన పోటీ ఉంది. క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ లను తట్టుకోవాలంటే ఈ మాత్రం కంటెంట్ లో మాస్టర్ లో ఉండాల్సిందే. బిజినెస్ కూడా మంచి ఫిగర్లతో క్లోజ్ అయినట్టుగా ఫిలిం నగర్ సమాచారం. అనిరుధ్ రవిచందర్ పాటలు ఇప్పటికే హిట్టు కొట్టాయి. మరి విజయ్ కనక ఈసారి గట్టిగా జెండా పాతితే గతంలో సూర్య, విక్రమ్ లాంటి టాప్ స్టార్లు కోల్పోయిన తెలుగు మార్కెట్ మీద పట్టు సాధించవచ్చు. ఓటిటి ఆఫర్లకు టెంప్ట్ కాకుండా మరీ వేచి చూసిన మాస్టర్ దానికి తగ్గ ఫలితం దక్కుతుందో లేదో సరిగ్గా 10 రోజుల్లో తేలిపోతుంది.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetdeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetjojobetgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişjojobet