iDreamPost
iDreamPost
దేశంలోని అతి పెద్ద కార్ల పంపిణి సంస్థ అయిన మారుతి సుజుకి తాజాగా వినియోగదారులకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా తమ వాహనాల్ని కొనేవారికి భారీ తగ్గింపులని ప్రకటించింది. మారుతి సుజుకి తన అగ్రశ్రేణి మోడళ్లపై రూ.5000
నుంచి రూ.20,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. Wagon R, S-Presso, Swift, డిజైర్, విటారా, బ్రిజ.. లాంటి పలు మోడళ్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి.
మారుతీ సుజుకి ఆల్టోపై దాదాపు రూ.5,000 తగ్గింపు ప్రకటించింది. అదే బేస్-స్పెక్ STD ట్రిమ్‌పై ఎక్స్చేంజ్ మీద రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.5,000 నగదు తగ్గింపు కూడా ఇస్తుంది.
మారుతీ సుజుకి S-ప్రెసో పై ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో అయితే రూ.10,000 మరియు రూ.3,000 తగ్గింపు లభిస్తుంది.
మారుతీ సుజుకి సెలెరియో పై రూ.15,000 వరకు నగదు తగ్గింపుతో పాటు రూ.4,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు ఇస్తున్నారు. అలాగే రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది.
మారుతీ సుజుకి వ్యాగన్ఆర్ పై దాదాపు రూ.20,000 వరకు నగదు ప్రయోజనంతో పాటు రూ.4,000 కార్పొరేట్ ప్రయోజనాలని ఇస్తున్నారు. రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా కొనుగోలు చేయొచ్చు.
మారుతీ సుజుకి స్విఫ్ట్ ని రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ తగ్గింపులతో లేదా రూ.15,000 నగదు ప్రయోజనాలతో కొనుగోలు చేయవచ్చు.
మారుతీ సుజుకి డిజైర్ పై రూ.17,500 వరకు తగ్గింపుని ప్రకటించారు. అలాగే 2,500 కార్పొరేట్ తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ తో కొనుగోలు చేయొచ్చు.
మారుతీ సుజుకి విటారా బ్రెజా కొనుగోలుపై రూ.5,000 నగదు ప్రయోజనాన్ని అందిస్తోంది. అంతేకాకుండా రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.2,500 కార్పొరేట్ ప్రయోజనం కూడా ప్రకటించింది.
ఇలా పలు కార్లపై భారీ తగ్గింపులని ప్రకటించింది మారుతి సుజుకి. అలాగే ఎక్స్చేంజ్ పై కూడా భారీ ప్రయోజనాలని ఇస్తుంది. త్వరలో మారుతి సుజుకి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.