iDreamPost
android-app
ios-app

మరిముత్తు యాదృచ్ఛికంగా ఫోటో దిగితే.. నిజమైంది!

మరిముత్తు యాదృచ్ఛికంగా ఫోటో దిగితే.. నిజమైంది!

కోలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు మరిముత్తు కన్నుమూసిన సంగతి విదితమే. ఆయన మరణ వార్తతో తమిళ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇటీవల ఆయన నటించిన సినిమా జైలర్ విడుదలై సెన్సేషన్ హిట్‌గా నిలిచింది. ఆ ఆనందంలో ఉండగానే ఈ మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ చిత్రంలో విలన్ గ్యాంగ్‌లో ఓ సభ్యుడిగా ఉన్నారు మరిముత్తు. అజిత్ ద్విపాత్రాభినయం చేసిన వాలి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలైన ఆయన కెరీర్ మొదలైంది. 2008లో కన్నుమ్ కన్నుమ్ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచమయ్యారు. మణిరత్నం, ఎస్ జే సూర్య వంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. డైరెక్టర్‌గా అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఫేమస్ అయ్యారు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి సుపరిచతం అయ్యారు మరిముత్తు. అనేక హిట్స్ సినిమాల్లో కనిపించారు.

సాధారణంగా సినిమాల్లో ఓ చావు సీన్ తీసేటప్పుడు డైరెక్టర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని వినికిడి. కొన్నిసార్లు చావు ముందే చెబుతుందా అని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అందుకు సెలబ్రిటీలు అతీతమేమీ కాదని మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు అదే ఆయన మరణం విషయంలో నిజమైనట్లు కనిపిస్తోంది. మరిముత్తుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. దీని చూసిన చాలా మంది కంటతడి పెడుతున్నారు. ఇటీవల ఓ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన.. తన శ్రద్దాంజలి బ్యానర్ ఉన్న చోట.. ఓ అభిమానితో కలిసి ఫోటో దిగాడు. యాదృచ్ఛికంగా జరిగిన ఘటన ఆయన జీవితంలో నిజమయ్యే సరికి అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయనకు మరణం ముందే సిగ్నల్ ఇచ్చిదంటూ మాట్లాడుకుంటున్నారు. కాగా, ఆయనకు సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasKulisbet girişmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis