iDreamPost
android-app
ios-app

అప‌రిచితుడు ఫ‌స్ట్ వెర్స‌న్ మాన‌వుడు – దాన‌వుడు – Nostalgia

అప‌రిచితుడు ఫ‌స్ట్ వెర్స‌న్ మాన‌వుడు – దాన‌వుడు – Nostalgia

1886లో అంటే మ‌నం ఇంకా ప‌ద్యాలు, భార‌త‌రామాయ‌ణ చ‌ర్చ‌లే సాహిత్యం అనుకునే కాలంలో స్టీవెన్‌స‌న్ ఒక న‌వ‌ల రాశాడు. దాని పేరు డాక్ట‌ర్ జెకిల్ అండ్ మిస్ట‌ర్ హైడ్. ఒక మ‌నిషిలో మంచోడే కాదు, దుర్మార్గుడు కూడా ఉంటాడ‌నే క‌థ అంటే Split Personality. ఒక ర‌కంగా చెప్పాలంటే మాన‌సిక విశ్లేష‌ణ తొలి న‌వ‌ల ఇది.

మ‌న తెలుగు సినిమాల‌కి సైకో ఎనాల‌సిస్ అనే ప‌ద‌మే తెలియ‌ని కాలంలో 1972లో మాన‌వుడు -దాన‌వుడు వ‌చ్చింది. శోభ‌న్‌బాబు హీరో. అప‌రిచితుడుకి ఇది ఫ‌స్ట్ వెర్స‌న్‌. 48 ఏళ్ల క్రితం ఈ క‌థ చాలా కొత్తది అయిన‌ప్ప‌టికీ , రొటీన్ సినిమాటిక్‌గా తీయ‌డం వ‌ల్ల క్లాసిక్ ల‌క్ష‌ణాలు పోగొట్టుకుంది. అయితే ఆ కాలంలో ఇది హిట్‌.

బాల్యంలోనే హీరో శోభ‌న్‌బాబు అక్క‌య్య కృష్ణ‌కుమారిని ముగ్గురు ఎత్తుకెళ్లిపోతారు. ఆ సంఘ‌ట‌న హీరోపై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతుంది. వాళ్లు గుర్తొస్తేనే హీరో పెద‌వుల నుంచి ర‌క్తం పారుతుంది. ఇది త‌ర్వాత చాలా సినిమాల్లో వాడారు. (శింబూ-మ‌న్మ‌థ‌) ప‌గ తీర్చుకోవ‌డ‌మే అత‌ని ధ్యేయం. ప‌గ , ప్ర‌తీకారాల వ‌ల్ల మ‌నిషి దాన‌వుడుగా మారుతాడ‌ని అత‌న్ని పెంచిన తండ్రి ఉప‌దేశిస్తాడు.

త‌ర్వాత హీరో చ‌దువుకుని డాక్ట‌రై పేద ప్ర‌జ‌ల‌కి సేవ చేస్తూ ఉంటాడు. ఒక‌రోజు త‌న అక్క‌ని అన్యాయం చేసిన దుర్మార్గున్ని చూస్తాడు. అత‌ను ఎవ‌రో కాదు. త‌న‌ని ప్రేమిస్తున్న అమ్మాయి తండ్రి.

ప‌గ తీర్చుకోవాలంటే ఏం చేయాలి? వేల మందికి సేవ చేసే డాక్ట‌ర్ ఒక హంత‌కుడిగా మార‌డ‌మా? లేదంటే ప‌గ‌ని మ‌రిచిపోవ‌డ‌మా?

స‌గం సినిమా ఇదే న‌డుస్తుంది. హీరో విల‌న్‌ని గుర్తు ప‌ట్టే స‌మ‌యానికి కొత్త వ్య‌క్తి రంగ ప్ర‌వేశం చేస్తాడు. డ‌బ్బు కోసం ప్రాణాలు తీసే రౌడీ. శోభ‌న్ రౌడీగా ఉండి విల‌న్ల‌ను చిత‌క‌బాదుతూ ఫైటింగ్ చేయ‌డం జ‌నాల‌కి న‌చ్చేసి చూసేశారు. హీరోని రౌడీగా నాట‌కం ఆడుతున్నాడ‌ని తెలిసినా ప‌ట్టించుకోలేదు.

నిజానికి సినిమాటిక్‌గా కాకుండా , మారు వేషాల గోల లేకుండా హీరోలోనే Split Personality ఉండి త‌న‌కు తెలియ‌కుండానే ప‌గ తీర్చుకుంటే అప‌రిచితుడులా క్లాసిక్ అయి ఉండేది. అయితే హీరో రాత్రిపూట రౌడీగా తిర‌గ‌డం అప్ప‌టికి కొత్త ఐడియా.

సినిమా చాలా స్లోగా ఉంటుంది. మ‌రీ బోరు కొట్ట‌దు. రెండు పాట‌లు సూప‌ర్ హిట్‌. సంగీతం ఇచ్చిన అశ్వ‌త్థామ , మాట‌లు రాసిన మోదుకూరి జాన్‌స‌న్ ఇద్ద‌రూ అర్ధాంత‌రంగా చ‌నిపోవ‌డం విషాదం.

రాజ‌బాబు ఉన్నా పెద్ద కామెడీ ఉండ‌దు. పి.చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన హిట్ సినిమాల్లో ఇదొక‌టి. 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş