iDreamPost
android-app
ios-app

వీడు మామూలోడు కాదు.. స్కామర్‌తోటే ఆడుకున్నాడు!

వీడు మామూలోడు కాదు.. స్కామర్‌తోటే ఆడుకున్నాడు!

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా స్కామర్‌లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగాలు, వలపు వలలు పేరిట జనాల్ని నిండా ముంచేస్తున్నారు. స్కామర్ల మోసాల కారణంగా ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే, తమను మోసం చేయటానికి ప్రయత్నించే స్కామర్లకు చుక్కలు చూపించే వారు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ వ్యక్తి స్కామర్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. తన ప్రేమతో స్కామర్‌కు చుక్కలు చూపించాడు.

ఇంతకూ ఏం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం చెట్టి అరుణ్‌ అనే వ్యక్తి వాట్సాప్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో ఈ విధంగా ఉంది.. ‘‘హాయ్‌.. నా పేరు లావణ్య హాల్సియోన్‌ ఇండియాలో కంపెనీలో అసిస్టెంట్‌ హెచ్‌ఆర్‌గా పని చేస్తున్నాను. నౌకరిలో మీ రెస్యూమ్‌ చూసి మెసేజ్‌ చేస్తున్నాము. మీ కోసం ఓ మంచి జాబ్‌ ఉంది’’ అని ఉంది. ఆ మెసేజ్‌ స్కామర్ల నుంచి వచ్చిందని అరుణ్‌ గుర్తించాడు. వారికి తగిన విధంగా బుద్ది చెప్పాలనుకున్నాడు. ‘‘హాయ్‌.. మీ పేరు చాలా బాగుంది. దాని అర్థం ఏంటి? ’’ అని ప్రశ్నించాడు. ఆమె దానికి సమాధానం చెప్పకుండా జాబ్‌ గురించి చెప్పింది. బాగా డబ్బులు సంపాదించవచ్చని అంది.

అప్పుడు వరుణ్‌‘‘ నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి లావణ్య, నాకు ప్రేమ కావాలి. ప్రేమకు సంబంధించి ఏవైనా ప్రోగ్రాములు ఉంటే చెప్పండి’’ అని అడిగాడు. దానికి ఆ స్కామర్‌ ‘‘ అలాంటి ప్రోగ్రామ్‌లు ఏవీ లేవు. మీకు పని చేయటానికి ఆసక్తి ఉంటే చెప్పండి’’ అంది. అప్పుడు వరుణ్‌ ‘‘ ఈ ప్రపంచంలో ప్రేమే లేదు. ఈశాన్య దేశంలో కొట్టుకుని చస్తున్నారు. అంటే.. ప్రపంచలో ఎక్కడా ప్రేమ లేదు’’ అని అన్నాడు. దీనికి స్కామర్‌ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక, వరుణ్‌ ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. అవి కాస్తా వైరల్‌గా మారాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet