iDreamPost
android-app
ios-app

ఏకంగా బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్… క్షణాల్లో 12 కోట్లు స్వాహా!

ఏకంగా బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్… క్షణాల్లో 12 కోట్లు స్వాహా!

బ్యాంకులో ఉన్న సొమ్ములు కూడా కనికట్టు చేసే విధంగా మాయం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సైబర్ మాయగాళ్ళు ఎలా మాటు వేస్తున్నారో ఎలా డబ్బు కొల్లగొడుతున్నారో కూడా అర్థం కాకుండా డబ్బు మాయం చేస్తున్నారు. ఒకప్పుడు దారి దోపిడీలు, రోడ్ సైడ్ స్నాచింగ్ లు చేసేవాళ్ళు కూడా దందాలు మార్చేసి ఆన్లైన్ వేదికగా డబ్బు దోచుకోవడం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకుల్లోని డబ్బులు మాయం చేయడంతో పాటు అమాయక ప్రజలను కూడా ఈజీగా మోసం చేస్తున్నారు. మీకు లోన్ వచ్చిందని, కొంత ఎమౌంట్ జమ చేస్తే పూర్తి డబ్బులు తీసుకోవచ్చని ప్రజలకు ఫోన్ కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

అలాగే ఓఎల్ఎక్స్ తరహా మోసాలు చెప్పనవసరం లేదు. రకరకాలుగా సైబర్ నేరగాళ్లు, అమాయక ప్రజలను కొంత ఏ సైబర్ నేరాల మీద అవగాహన లేని వారిని ఈజీగా మాయచేసి డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ఎన్ని సూచనలు చేసినా ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఒక బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ చేసి 12 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఏపీ సహకార మహేశ్ అర్బన్ బ్యాంక్ సర్వర్‌లను హ్యాక్ చేసి రూ.12 కోట్లను వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. కొందరు వ్యక్తులు బ్యాంకు సర్వర్‌లను హ్యాక్ చేసి, ఆ తర్వాత ప్రధాన ఖాతాల్లోకి లాగిన్ చేసి 100కు పైగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారని పోలీసులు తెలిపారు.

బ్యాంకు అధికారులు ఇంటర్నల్ వెరిఫికేషన్ నిర్వహించి హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేశ్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో తనిఖీలు చేసి పరిశీలించారు. ఈ మొత్తం ఎవరి బ్యాంకు ఖాతాలకు చేరిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. AP మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. బ్యాంక్ మొత్తం నాలుగు రాష్ట్రాల పరిధిలో మొత్తం 45 శాఖలను కలిగి ఉంది.

భారతదేశంలోని రెండవ అతిపెద్ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అయిన కాస్మోస్ బ్యాంక్ సర్వర్‌లను హ్యాక్ చేసిన తర్వాత కొంతమంది హ్యాకర్లు రూ. 94 కోట్లకు పైగా స్వాహా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అదే తరహాలో ఈ బ్యాంక్ సర్వర్ ను కూడా హ్యాక్ చేశారు. సామాన్యంగా బ్యాంకు సర్వర్ ని హ్యాక్ చేయడం అనేది అంత సాధారణమైన ప్రక్రియ ఏదీకాదు. బ్యాంకు సర్వర్ లో ఉన్న లోటు పాట్లు గురించి తెలిసిన వాళ్లే ఈ పని చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అలాగే చైనా హ్యాకర్లు కూడా ఈ బ్యాంకు సర్వర్లను టార్గెట్ చేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş