iDreamPost
android-app
ios-app

ఇకపై ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్!

  • Published Feb 21, 2024 | 12:08 PM Updated Updated Feb 21, 2024 | 12:08 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు.. ప్రముఖ వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపిస్తూ ఉంటారని అందరికి తెలిసిన విషయమే అయితే, తాజాగా మహేష్ బాబు ఫోన్ పే లో కూడా అందరిని సర్ప్రైజ్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు.. ప్రముఖ వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపిస్తూ ఉంటారని అందరికి తెలిసిన విషయమే అయితే, తాజాగా మహేష్ బాబు ఫోన్ పే లో కూడా అందరిని సర్ప్రైజ్ చేశారు.

  • Published Feb 21, 2024 | 12:08 PMUpdated Feb 21, 2024 | 12:08 PM
ఇకపై ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమాలలో ఏ రకమైన క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు. అలాగే, మహేష్ సినిమాలతో పాటు.. ఇటు ప్రముఖ సంస్థలకు బ్రాండింగ్ చేయడంలో కూడా ముందుంటారు. ఓ రకంగా కేవలం ప్రకటనల ద్వారా మాత్రమే.. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న హీరో మహేష్ బాబు. ఓ ఏడాదిలో మహేష్ నటించే సినిమాలకంటే కూడా .. ప్రకటనలే ఎక్కువగా ఉంటాయి. వచ్చిన ఏ ప్రకటనను కూడా మహేష్ తిరస్కరించారు. ఈ విషయంలో ఓ రకంగా మహేష్ తన కో స్టార్స్ కు ఇన్స్పిరేషన్ అని చెప్పి తీరాలి. ఒకవేళ అవసరం అయితే సినిమా షూటింగ్ ను పోస్ట్ పోన్ చేసుకునైనా సరే.. ముందు ప్రకటనల షూటింగ్ ను ముగించేస్తుంటారు మహేష్. అయితే, తాజాగా ఫోన్ పే లో కూడా మహేష్ తన వాయిస్ తో అందరిని సర్ప్రైజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత దాదాపు అందరూ ఫోన్ పే, జీ పే లాంటివే వినియోగిస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో వీటి వాడకం మరింత పెరిగిపోయింది. చిన్న చిన్న అమౌంట్స్ కి కూడా అందరూ డిజిటల్ పేమెంట్ యాప్స్ నే వినియోగిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఎక్కడైనా స్కాన్ చేసి ఫోన్ పే చేసిన తర్వాత.. అమౌంట్ రిసీవ్డ్ అనే వాయిస్ వినిపించేది. కానీ, ఇప్పుడు దానితో పాటు థాంక్ యు బాస్ అనే మహేష్ వాయిస్ కూడా వినిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే ఫోన్ పే కూడా మహేష్ ప్రకటనల ఖాతాలో చేరిందనిపిస్తోంది. కానీ, నిజానికి ఈ కంపెనీ ఇంకా అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ, షూట్ సమయంలో జరిగిన మహేష్ వాయిస్ శాంపిల్స్ తీసుకుని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా .. ఫోన్ పే స్కానర్ కు మహేష్ వాయిస్ ను అనుసంధానం చేశారు. ఇక ఇప్పటినుంచి ఎక్కడైనా ఫోన్ పే చేసిన తర్వాత .. ఆఖరిలో థాంక్ యు బాస్ అంటూ .. మహేష్ వాయిస్ వినిపిస్తుందన్న మాట. చూస్తుంటే మారుతున్న టెక్నాలజీకి కాస్త క్రీటివిటీని జోడిస్తూ.. ప్రజలను సర్ప్రైజ్ చేస్తున్నట్లు ఉంది.

ఇక దీనిపై ఫోన్ పే తరపున అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. గతంలో కూడా ఈ యాడ్స్ కోసం ప్రముఖ స్టార్స్ పని చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఈ ఏడాది నుంచి కొత్తగా మహేష్ వాయిస్ ను వినిపిస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం చాలా చోట్ల మహేష్ వాయిస్ వినిపిస్తోంది. ఇది వింటున్న వినియోగదారులు ఇదేంటి కొత్తగా అని కాస్త సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. మరి, ఈ ప్రకటనలకు ఎవరెవరు ఎంత ఛార్జ్ చేశారన్నది ఎవరికీ తెలియదు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళితో ఎంగేజ్డ్ గా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా స్టార్ట్ కాకముందే అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రానున్న రోజుల్లో ఎటువంటి అప్ డేట్స్ వస్తాయో వేచి చూడాలి. మరి, తాజాగా ఫోన్ పే లో వినిపిస్తున్న మహేష్ వాయిస్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş