iDreamPost
android-app
ios-app

ఏప్రిల్‌ 26న సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘భరత్‌ అనే నేను’ 

  • Published Feb 16, 2018 | 1:14 AM Updated Updated Feb 16, 2018 | 1:14 AM
  • Published Feb 16, 2018 | 1:14 AMUpdated Feb 16, 2018 | 1:14 AM
ఏప్రిల్‌ 26న సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘భరత్‌ అనే నేను’ 

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ ”ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీనికి కంటిన్యుయేషన్‌గా పూనెలో షెడ్యూల్‌ ఉంటుంది. మార్చి 27 వరకు టోటల్‌గా సినిమాకి సంబంధించిన వర్క్‌ అంతా పూర్తవుతుంది. ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా ‘భరత్‌ అనే నేను’ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తాం. మహేష్‌గారితో కొరటాల శివ కాంబినేషన్‌లో ఇంత భారీ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది. మా బేనర్‌కి ఇది ఓ ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది” అన్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ. 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom