Keerthi
ఇంట్లోనే ఉంటూ నచ్చిన సమయంలో ఎవరి సహాయం అవసరం లేకుండా చక్కగా ఒక్కరే రన్ చేసుకునే బిజినెస్‌లు చేసుకోవాలని అనుకుంటారా.. అలాంటి వారి కోసం తక్కువ బడ్జెట్ తో రోజుకి రూ.1000 సంపాదించే అద్భుతమైన బిజినెస్ అందుబాటులో ఉంది.
ఇంట్లోనే ఉంటూ నచ్చిన సమయంలో ఎవరి సహాయం అవసరం లేకుండా చక్కగా ఒక్కరే రన్ చేసుకునే బిజినెస్‌లు చేసుకోవాలని అనుకుంటారా.. అలాంటి వారి కోసం తక్కువ బడ్జెట్ తో రోజుకి రూ.1000 సంపాదించే అద్భుతమైన బిజినెస్ అందుబాటులో ఉంది.
Keerthi
ప్రతిఒక్కరికి సొంతంగా వ్యాపారం చేయాలనే కల ఉంటుంది. ముఖ్యంగా ఆ విషయంలో యువత ఆలోచనలు మారింత మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంట్లోనే ఉండి నష్టం ష‍్టం లేకుండా, లాభాలు వచ్చేలా వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా.. సింగిల్ ఆదాయంతో ఖర్చులు పెరిగిపోతున్న రోజుల్లో చాలామంది సైడ్ ఇన్ కమ్ కోసం ఎదురుచూస్తుంటారు. . అయితే అందుకోసం పార్ట్ టైమ్ జాబ్‌లు చేయాలన్నా అందుకోసం కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది.
కానీ, అందులో లీవ్స్ దొరకవు. అలా అని రెండు ఉద్యోగాలు ఒకేసారి హ‍్యాండిల్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారి కోసం తాజాగా తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచి రోజుకు రూ.1000 సంపాదించే అద్భుతమైన బిజినెస్ అందుబాటులోకి వచ్చింది ఆ వివరాళ్లోకి వెళ్తే.. చాలామంది ఇంట్లోనే ఉంటూ నచ్చిన సమయంలో ఎవరి సహాయం అవసరం లేకుండా చక్కగా ఒక్కరే రన్ చేసుకునే బిజినెస్‌లు చేసుకోవాలని అనుకుంటారు. మరి అలాంటి బిజినెస్ లో బాల్ పెన్ తయారీ కూడా ఒకటి. అసలు నష్టం అనేది లేకుండా సీజన్‌తో సంబంధం లేకుండా.. పెన్స్ అవసరం అనేది ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఇలాంటి బిజినెస్‌ను మీ సైడ్ ఇన్‌కమ్‌గా మార్చుకుంటే వేలలో ఆర్జించవచ్చు. ఇంతకీ బాల్ పెన్ మేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఎంత ఖర్చు అవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బాల్ పెన్ తయారీకి మొత్తం ఐదు రకాల మిషన్స్ అవసరం ఉంటాయి. అయితే ఈ మీషన్ ల ధర కేవలం రూ. 20వేల లోపు మాత్రమే ఉంటుంది. ముఖ‍్యంగా బాల్ పెన్ తయారీకి ఇంక్ ఫిల్లర్, ఆడప్టర్ ఫిట్టింగ్ మిషిన్, టిఫ్ ఫిట్టింగ్, నేమ్ ప్రింటింగ్ మిషన్, సెంట్రి ఫ్యూజ్ మిషన్స్ అవసరం ఉంటాయి. అలాగే యూజ్ అండ్ త్రో బాల్ పెన్స్‌ను తయారు చేయడానికి పెన్స్ (బ్యారెల్), క్యాప్స్, నిబ్స్, ఆడపర్లు అవసరపడతాయి. కాగా, ఈ రా మెటీరియల్‌ను బాల్ పెన్ తయారీ మిషిన్స్‌ను అమ్మే చోట్ల లభిస్తాయి. ఇక పెన్నులను ఎలా తయారు చేయాలన్న విషయాన్ని కూడా వారే నేర్పిస్తారు.
ఇక ఈ బాల్ పెన్ బిజినెస్ లాభాల విషయానికొస్తే.. ఒక బాల్ పెన్నును తయారు చేయడానికి మనకు సుమారు రూ. 1.50 అవుతాయి. మార్కెట్లో ఈ పెన్నులను రూ. 3 నుంచి రూ. 4 వరకు విక్రయిస్తున్నారు. హోల్ సేల్‌గా ఒక్క పెన్‌పై కేవలం 75 పైసల లాభానికి విక్రయించొచ్చు. రోజుకు సులభంగా వెయ్యి పెన్నులను తయారు చేసుకోవచ్చు. ఈ లెక్కన రోజుకు సుమారు రూ. 750 సంపాదించవచ్చు. ఇలా నెలకు కనీసం రూ. 20 వేలు ఏటు పోవు. అందులోనూ ఈ బాల్ పెన్ తయారీకి రూమ్ రెంట్ అవసరం ఉండదు, కరెంట్ అవసరం ఉండదు. ప్రతీసారి రా మెటీరియల్ కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది. మరి, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నవారికి అందుబాటులో ఉన్న ఈ బాల్ పెన్ను బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.