iDreamPost
android-app
ios-app

పోలీస్ స్టేషన్ లోనే ఉంటామంటున్న ప్రేమ జంట! అసలు సంగతి ఏంటంటే?

  • Published Aug 22, 2023 | 9:10 PM Updated Updated Aug 22, 2023 | 9:10 PM
  • Published Aug 22, 2023 | 9:10 PMUpdated Aug 22, 2023 | 9:10 PM
పోలీస్ స్టేషన్ లోనే ఉంటామంటున్న ప్రేమ జంట! అసలు సంగతి ఏంటంటే?

ఈ కాలం యువత ఎవరూ ఏమనుకున్నా సరే నచ్చిన వాడినే మనువాడాలని అనుకుంటున్నారు. కులాలు, మతాలు వేరైనా ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకునేందుకు సిద్దపడుతున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకుంటే సరి.. లేకుంటే వారిని ఎదురించి మరీ గుళ్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు సమాజంలో చాలా వరకు ఇలాంటి వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. అచ్చం ఇలాగే ధైర్యం చేసి ఓ ప్రేమ జంట ఇటీవల గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇక రక్షణ కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. ఈ యువతి, యువకుడు మేము పోలీస్ స్టేషన్ లోనే ఉంటామని, బయటకు వచ్చేదే లేదంటూ తెగేసి చెప్పారు. అసలు విషయం ఏంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చంద్రకళ అనే యువతి ఉద్యోగం చేస్తుంది. ఇక్కడే సతీష్ అనే యువకుడు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అలా వీరిచయం చివరికి ప్రేమగా మారింది. దీంతో చాలా కాలంగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వీరిద్దరి కులాలు వేరు కావడంతో ఇరువరి పెద్దలు అంగీకరించలేదు. ఈ ప్రేమ జంట పెద్దలను ఎదురించి స్థానికంగా ఉన్న ఓ గుడిలో ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

అనంతరం రక్షణ కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిపించి కౌన్స్ లింగ్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే వీరి పెద్దలు ఈ ప్రేమికులను విడదీసే ప్రయత్నం చేశారు. ఇక భయపడిపోయిన ఈ ప్రేమ జంట.. మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రామని, వస్తే మమ్మల్ని విడదీస్తారని పట్టుబట్టి స్టేషన్ లోనే కూర్చున్నారు. దీంతో పోలీసులు ఇద్దరికీ కౌన్స్ లింగ్ ఇచ్చి పంపిస్తామని చెప్పారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: మహిళా టీచర్ ను వేధించిన ఆకతాయి.. రక్షించిన దిశ పోలీసులు

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet