sai
sai
పార్కింగ్ గొడవ ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు లో జరిగింది. తిరువళ్లూరు జిల్లాలోని ఉత్తరపెరుంబక్కం గ్రామం దగ్గర్లో ఉన్న ప్రైవేటు పార్కింగ్ స్థలంలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్ర, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన వారు లారీలను పార్కింగ్ చేస్తారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి స్థానిక గ్రామానికి చెందిన కమలకన్నన్, కుమరన్, నవీన్ తదితరులు లారీ యార్డు వద్ద మద్యం సేవిస్తుండగా, అక్కడే పార్కింగ్ చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీని బయటకు తీయడానికి డ్రైవర్ లాల్‌సింగ్ యత్నించాడు.
దాంతో.. తాము మద్యం సేవించడం పూర్తయ్యాకే లారీలను బయటకు తీయాలని లారీ డ్రైవర్ తో ఘర్షణకు దిగారు. ఆగ్రహించిన లాల్ సింగ్ ఆ ముగ్గురిపైనా లారీ ఎక్కించి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో కమలకన్నన్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణమైన లారీడ్రైవర్, క్లీనర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.