iDreamPost
android-app
ios-app

ఇది కదా జాబ్‌ అంటే.. కుక్కలను చూసుకుంటే రూ. కోటి జీతం.. లగ్జరీ ఫ్లైట్‌లో జర్నీ!

  • Published Jun 26, 2023 | 6:17 PM Updated Updated Jun 26, 2023 | 6:17 PM
  • Published Jun 26, 2023 | 6:17 PMUpdated Jun 26, 2023 | 6:17 PM
ఇది కదా జాబ్‌ అంటే.. కుక్కలను చూసుకుంటే రూ. కోటి జీతం.. లగ్జరీ ఫ్లైట్‌లో జర్నీ!

ఈమధ్యకాలంలో కొన్ని రకాల ఉద్యోగాల గురించి వింటే.. ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టే పరిస్థితి. అవును మరి ఆ ఉద్యోగాలకు ఓ రేంజ్‌లో జీతం, అలవెన్స్‌లు కల్పిస్తున్నారు. మరి ఆ ఉద్యోగాలు ఎంతో కఠినమైనవా అంటే.. కాదు.. చాలా తేలికగా ఉండేవి కూడా ఉంటున్నాయి. ఇక తాజాగా ఈ కోవకు చెందిన ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈమధ్య కాలంలో పెంపుడు జంతువులను పెంచుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఉరుకులపరుగుల జీవితాలు కావడం.. ఒకే ఇంట్లో ఉంటున్నా సరే మనసు విప్పి.. పది నిమిషాలు మాట్లాడుకునే తీరక లేని పరిస్థితులు.

దాంతో చాలా మంది మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం కోసం పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. అనాది కాలంగా మనిషికి ఆత్మీయ నేస్తంగా ఉన్న జంతువు అంటే కుక్క అనే చేబుతాం. పట్టెడు మెతుకులు పెడితే.. చాలు అది బతికి ఉన్నంత కాలం విశ్వాసంగా ఉంటుంది. అదిగో అలాంటి కుక్కను చూసుకోవడం కోసం కేర్‌ టేకర్‌ కావాలి.. జీతం భారీగా ఇస్తామంటూ ఇచ్చిన యాడ్‌ ఒకటి వైరలవుతోంది. ఆ వివరాలు..

లండన్‌కు చెందిన ఒక బిలియనీర్‌ తన కుక్కను చూసుకోవడానికి ఏకంగా కోటి రూపాయల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. సాధరణంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. తమ ఆర్థిక అవసరాలన్నింటిని.. నెల జీతంతోనే సరిపెట్టుకోవాలి. కానీ నేటి కాలంలో.. అరకొర జీతాలతో.. బతుకుబండి లాగడం అంత తేలిక కాదు. అదనపు ఆదాయం కోసం వేరే పని చేద్దామన్నా కుదిరే పరిస్థితులు లేవు. అయితే ఇలాంటి వారికి లండన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త బంపరాఫర్‌ ప్రకటించాడు. తన కుక్కను చూసుకునేవారికి ఏడాదికి ఏకంగా రూ. కోటి ప్యాకేజీని ఆఫర్‌ చేశాడు.

సదరు బిలియనీర్‌కు కుక్కలంటే చాలా ఇష్టమని తెలిపాడు. ప్రస్తుతం తన దగ్గర ఉన్న రెండు కుక్కలను చూసుకుంటే సంవత్సరానికి రూ. కోటి ప్యాకేజీ కింద ఇస్తానని ఆఫర్‌ చేశాడు. అంతేకాకుండా కుక్కలను చూసుకునేవారికి ఏడాదికి 42 రోజులు సెలవులతో పాటు వాటిని ఎటు తీసికెళ్తే ఆ ప్రదేశాలకు లగ్జరీ జెట్‌లో ప్రయాణించే ఛాన్స్‌ కూడా ఉందని తెలిపారు. ఈ ప్రయాణాల్లో భాగంగా భోజనంతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చుతున్నట్లు పేర్కోన్నారు. ఈ జాబ్‌ చేసేవారు సంపన్నులతో మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయని వెల్లడించారు.

ఏం పనులు చేయాలంటే..

ఈ ఉద్యోగంలో చేరేవారు తమ విధుల్లో భాగంగా ప్రతి రోజు కుక్కలకు ఆహారం అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాటికి జబ్బు చేసినప్పుడు డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాలి.. ప్రతి రోజు స్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా రోజు కుక్కలకు అవసరమైన పనులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసేవారికి కొన్ని కండీషన్స్‌ కూడా పెట్టారు. ఈ జాబ్‌ చేసేవారికి కుక్కల గురించి తప్పకుండా తెలిసి ఉండాలని, అవి తినే ఆహార పదార్థాలపై పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. అంతేకాకుండా ఈ ఉద్యోగం పొందిన వారు తన జీవితం కన్నా కూడా కుక్కలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఏది ఏమైనా కేవలం కుక్కలను చూసుకుంటే ఏకంగా కోటి రూపాయలు జీతం ఇస్తాననడం మాత్రం నిజంగా గ్రేట్‌ అంటున్నారు ఈ యాడ్‌ చూసిన వారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet