iDreamPost
android-app
ios-app

రూ. 200 చెప్పుల కామెంట్ పై రాఖీని ట్రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్

  • Published Jul 25, 2022 | 2:58 PM Updated Updated Jul 25, 2022 | 2:58 PM
  • Published Jul 25, 2022 | 2:58 PMUpdated Jul 25, 2022 | 2:58 PM
రూ. 200 చెప్పుల కామెంట్ పై రాఖీని ట్రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్

విజయ్ దేవరకొండ పాన్-ఇండియా చిత్రం లిగర్‌తో దుమ్మురేపునున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను కొన్ని రోజుల క్రితం ముంబైలో హంగామాతో లాంచ్ చేశారు. ర‌ణ్వీర్ సింగ్ చీఫ్ గెస్ట్. ట్రైలర్ లాంచ్‌లో, విజయ్ ప్యాంట్‌, టీ-షర్ట్ తో వ‌చ్చాడు. ప‌క్కనున్న‌ ముంబై స్టార్లు జిగేల్ మంటుంటే, విజయ్ మాత్రం రూ. 200 చెప్పులేసుకున్నాడు. విజ‌య్ ఫ్యాన్స్ అతని సింప్లిసిటీని ఇష్టపడుతుండగా, కొంద‌రు మాత్రం అత‌న్ని ట్రోల్ చేశారు. సోష‌ల్ మీడియా ఇటీవ‌ల బాగా యాక్టీవ్ అయిన‌ రాఖీ సావంత్, విజయ్ డ్రెస్సింగ్ మీద కామెంట్స్ చేసింది. తన ప్రియుడు ఆదిల్ ఖాన్‌తో పోల్చేసింది.

రాఖీని ఫోటోగ్రాఫ‌ర్లు బాయ్ ఫ్రెండ్ తో ఫోజులివ్వ‌మ‌న్నారు. కాని బాయ్‌ఫ్రెండ్ కారులో ఉన్నాడు. చెప్పులేసుకున్నాడు. అందుకే మీడియా ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నాడని చెప్పింది. అప్పుడే అసంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చింది. లైగ‌ర్ ట్రైలర్ లాంచ్‌లో ఒక హీరో చప్పల్స్ వేసుకున్న‌ప్పుడు, తన బాయ్‌ఫ్రెండ్ ఎందుకు ధ‌రించ‌కూడ‌దు? హీరో కంటే త‌న బాయ్ ఫ్రెండ్ త‌క్కువేంకాద‌ని కామెంట్ చేసింది.


రాఖీ ప్రేలాప‌న‌తో విజయ్ ఫ్యాన్స్ బాధ‌ప‌డ్డారు. నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్ప‌డానికి మ‌ధ్య‌లో మా లైగ‌ర్ హీరో ప్ర‌స్తావ‌న ఎందుక‌ని ట్రోలింగ్ మొద‌లుపెట్టారు. కెమేరా క‌నిపిస్తే కాస్త దూకుడుగా మాట్లాడానికి రాఖీ ఎప్పుడూ రెడీ.

లైగ‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోపాటు అనన్య పాండే, ర‌మ్య కృష్ణ‌ ప్రధాన పాత్రలో నటించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం. 2022 ఆగస్టు 25న విడుదల కానుంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి బ‌జ్ వ‌చ్చింది. మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తుంటే, అనన్య టాలీవుడ్ లో అడుగుపెడుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet