iDreamPost
android-app
ios-app

ల్యాప్స్డ్ పాలసీలు ఇక ఈజీగా పునరుద్ధరించుకోవచ్చు: LIC బంపరాఫర్

ల్యాప్స్డ్ పాలసీలు ఇక ఈజీగా పునరుద్ధరించుకోవచ్చు: LIC బంపరాఫర్

అనుకోని కారణాల వల్ల మీ LIC పాలసీ ల్యాప్స్ అయిందా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే! లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ల్యాప్స్డ్ పాలసీలను పునరుద్ధరించుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్టు 17న మొదలయ్యే ఈ డ్రైవ్ అక్టోబర్ 21 వరకు కొనసాగుతుంది. యులిప్ పాలసీలు తప్పించి మిగతా అన్ని బీమా పాలసీలను ఈ కార్యక్రమంలో పునరుద్ధరించుకోవచ్చు. పైగా లేట్ ఫీలో ఆకర్షణీయమైన డిస్కౌంట్ కూడా ఉంటుందని LIC వర్గాలు చెబుతున్నాయి. చివరి ప్రీమియం చెల్లించిన తేదీ నుంచి ఐదేళ్ళు దాటని పాలసీలకు ఈ డ్రైవ్ వర్తిస్తుంది. సూక్ష్మ బీమా పాలసీలపై అయితే ఆలస్య రుసుము పూర్తిగా మాఫీ అవుతుంది.