iDreamPost
android-app
ios-app

లియోలో భయపెట్టిన యంగ్ విలన్.. ఓంకారన్నయ్య డ్యాన్స్ షోలోనా..?

  • Published Nov 02, 2023 | 3:05 PM Updated Updated Nov 02, 2023 | 3:05 PM

డాక్టర్ అవుదామని యాక్టర్ అవ్వడం పాత మాట. ఇప్పుడు డ్యాన్సర్ లేదా కొరియోగ్రఫర్ అవుదామని వచ్చి నటుడిగా మారిపోయాం అనడం కొత్తమాట. ఎందుకంటే.. ఇతడిని చూస్తే నిజమనిపించకమానదు. ఇటీవల ఓ చిత్రంలో యంగ్ విలన్ గా భయపెట్టేశాడు ఇతగాడు.

డాక్టర్ అవుదామని యాక్టర్ అవ్వడం పాత మాట. ఇప్పుడు డ్యాన్సర్ లేదా కొరియోగ్రఫర్ అవుదామని వచ్చి నటుడిగా మారిపోయాం అనడం కొత్తమాట. ఎందుకంటే.. ఇతడిని చూస్తే నిజమనిపించకమానదు. ఇటీవల ఓ చిత్రంలో యంగ్ విలన్ గా భయపెట్టేశాడు ఇతగాడు.

  • Published Nov 02, 2023 | 3:05 PMUpdated Nov 02, 2023 | 3:05 PM
లియోలో భయపెట్టిన యంగ్ విలన్.. ఓంకారన్నయ్య డ్యాన్స్ షోలోనా..?

సినిమా ఇండస్ట్రీలో ఏదో సాధిద్దామని తపనతో వస్తుంటారు. కొంత మంది డైరెక్టర్లు అవుదామని యాక్టర్లు అవుతుంటారు. నటులు అవుదామని వచ్చి డైరెక్టర్లు అయిన వారున్నారు. అయితే కొంత మందికి గుర్తింపు తర్వగా వస్తుంది. మరికొంత మందికి ఆలస్యంగా వచ్చి చేరుతుంది. వెండి తెరపై సాధ్యం కాకపోతే.. బుల్లితెరలో అయినా రాణిద్దామని ప్రయత్నాలు చేస్తుంటారు. బుల్లితెర అయితేనేం మొత్తానికి పరిశ్రమలో ఉన్నాం కదా అని సంతోషపడిపోతుంటారు. వెండితెరపై తమ పేరు ఏనాటికైనా కనిపించకపోదా అన్న సజీవమైన ఆశలతో తమ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కోవకే వస్తాడు ఈ వ్యక్తి కూడా. ప్రస్తుతం ఇతడు నెట్టింట్లో చర్చకు కారణమయ్యాడు.

అతడు ఎవరంటే.. శాండీ. శాండీ మాస్టర్ అంటే తమిళనాడులో మంచి క్రేజ్.  ఇటీవల విడుదలైన మూవీ లియోలో గుర్తింపు ఉండిపోయే పాత్రలో మెప్పించాడు. ఈ మూవీలో తొలి పార్ట్‌లో కనిపించే విలన్ గ్యాంగులో ఉంటాడు. అందులో చాలా క్రూరంగా, భయంకరంగా కనిపిస్తాడు శాండీ. ఈ మూవీలో అతడు హీరో కాఫీ షాపుకు వెళ్లి..‘ చాక్లెట్ కాఫీ’అని అడుగుతాడు. ఈ డైలాగ్ ఇప్పుడు ఇతడికి మంచి గుర్తింపు తెచ్చింది. అతడి తీరు, డైలాగ్ డెలివరీ, నటన చూస్తూ ఒళ్లు గగొర్పొడవడం ఖాయం. అంతలా  ఆ పాత్రకు ప్రాణం పోశాడు. కనిపించేది కొన్ని సీన్లే అయినా.. భయపెట్టిస్తాడు. ఈ శాండీ ఇలాంటి గుర్తింపు అస్సలు ఊహించి ఉండడు. ఎందుకంటే.. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అతడు.. నటుడిగా అవతారం ఎత్తాడు.

తమిళనాడులో పుట్టి పెరిగిన శాండీ (అసలు పేరు సంతోష్ కుమార్ అని తెలుస్తోంది). డ్యాన్సులు అంటే మక్కువతో సినిమాల్లోకి వచ్చాడు. ప్రముఖ ఛానల్ కలైంజర్ టీవీలో మానాడ ముయిలా సీజన్ 1లో డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన అతడు.. పలు టీవీ షోలు చేశాడు. ఆ తర్వాత సినిమాలకు వర్క్ చేయడం మొదలు పెట్టాడు. బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా ఉన్నాడు. కాలా మూవీలో రజనీకాంత్‌తో స్టెప్పులు వేయించాడు. అలాగే నటుడిగా కూడా అవతారం ఎత్తి పలు సినిమాల్లో నటించాడు.  తెలుగులో కూడా ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నాడు. అదే ఓంకార్ అన్నయ్య డ్యాన్స్ ప్రోగ్రాం.. చాలెంజ్ 3. మరో మాస్టర్స్ తో కలిసి డ్యాన్స్ చేసి.. జడ్జస్ స్థానంలో ఉన్న పోసాని కృష్ణ మురళి పొగడ్తలతో ముంచెత్తారు.

ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ మారడంతో.. మీమర్స్ తమ చేతులకు పని చెప్పారు. హే నిన్ను ఎక్కడో చూసినట్లు ఉందే అన్న బ్రహ్మనందం డైలాగ్ తో కూడిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. నటుడిగా మారిన తర్వాత కూడా అతడు డ్యాన్సును వదల్లేదు.  చెన్నైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా డ్యాన్స్ చేసి దుమ్ము రేపేశాడు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రశంసలను అందుకున్నాడు. ఇక అతడి వ్యక్తిగత జీవితానికి వస్తే.. రెండు వివాహాలు జరిగాయి. నటి కాజల్ పశుపతిని వివాహం చేసుకోగా.. ఈ జంట 2012లో విడిపోయింది. ఆ తర్వాత మరో యువతిని వివాహం చేసుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Telangana _swags_ (@telangana_swags_)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom