iDreamPost
android-app
ios-app

RC 15 – లీకుల ప్రహసనం

  • Published Oct 12, 2022 | 5:03 PM Updated Updated Oct 12, 2022 | 5:03 PM
RC 15 – లీకుల ప్రహసనం

టైటిల్ కాదు కదా ఇంకా ఫస్ట్ లుక్ సైతం విడుదల కానీ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ సినిమా తాలూకు లీక్డ్ ఫోటోలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. ప్రస్తుతం రాజమండ్రిలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో చరణ్ గతానికి సంబంధించిన ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు. తనకు జోడిగా అంజలి నటిస్తోంది. స్వాతంత్రం రాకముందు జరిగే ఈ ఘట్టం కీలకమైనది. వర్తమానానికి ముడిపెడుతూ చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. దీనికోసమే చరణ్ తన మీసకట్టు హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చుకుని మేకోవర్ చేసుకున్నాడు. అయితే ఈ లీక్స్ ఇప్పుడే కాదు గతంలోనూ వచ్చాయి. తాజాగా అంజలితో కలిపి వస్తున్నాయి.


ఎస్విసి బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెయిన్ విలన్ గా ఎస్జె సూర్య చేస్తున్నాడు. ఆ భాగం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తీస్తున్నప్పుడు ఆ పిక్స్ కూడా బయటికి వచ్చాయి. అంత పెద్ద నిర్మాణ సంస్థ వందల కోట్ల బడ్జెట్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నప్పుడు ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా కఠినంగా ఉండాలి. రాజమౌళి అందుకే సెల్ ఫోన్లు కెమెరాలు వాడే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తేనేమో ఆర్సి తాలూకు ఫోటోలు ఎంచక్కా బయటికి వస్తున్నాయి. ప్రస్తుతానికి వాటిని కట్టడి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు కానీ ఎంతమేరకు నిలువరిస్తారో చూడాలి.

వచ్చే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ మూవీ 2023 వేసవిని టార్గెట్ గా పెట్టుకుంది కానీ అప్పటికి రావడం కూడా అనుమానమే అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం అవసరం కావడంతో పాటు శంకర్ దీంతో పాటు సమాంతరంగా కమల్ హాసన్ ఇండియన్ 2 చేస్తుండటంతో ఆలస్యం తప్పేలా లేదు. అదే జరిగితే ఏ దసరాకో దీపావళికో చూడాల్సి ఉంటుంది. కనీసం ఒక్క పోస్టర్ అయినా విడుదల చేయమని మెగా ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేస్తున్నా నిర్మాత మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీన్నిబట్టి రిలీజ్ డేట్ ఏ మాత్రం దగ్గరలో లేదని అర్థమవుతోందిగా. తమన్ సంగీతం, భారీ తారాగణం ఈ ఆర్సి 15కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవబోతున్నాయి

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis girişesrar satın al