UAE హెడ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌! మనకు వరల్డ్‌ కప్‌ అందించాడు

Lalchand Rajput, UAE: ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో బుడిబుడి అడుగులేస్తున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ క్రికెట్‌ జట్టుకు ఓ భారత మాజీ క్రికెటర్‌ హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. అతను భారత్‌కు ఓ వరల్డ్‌ కప్‌ కూడా అందించాడు. అతనెవరో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Lalchand Rajput, UAE: ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో బుడిబుడి అడుగులేస్తున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ క్రికెట్‌ జట్టుకు ఓ భారత మాజీ క్రికెటర్‌ హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. అతను భారత్‌కు ఓ వరల్డ్‌ కప్‌ కూడా అందించాడు. అతనెవరో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌లో ప్రతి జట్టుకు ఒక కోచ్‌ ఉంటాడు. ఒక టీమ్‌ ఆట మొత్తం మార్చే సత్తా ఒక్క కోచ్‌కే ఉంటుంది. సరైన కోచ్‌ దొరికితే.. పసికూన జట్టు కూడా సంచలన విజయాలు సాధిస్తుంది. అందుకే.. ప్రపంచంలోని అ‍గ్రశ్రేణి జట్లు సైతం తమ టీమ్స్‌కు మంచి మంచి కోచ్‌లను వెతికిమరీ పెడుతుంటాయి. అయితే.. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగులేస్తున్న యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) కూడా ఒక సూపర్‌ కోచ్‌ను పట్టుకుంది. తమ టీమ్‌కు ఓ మూడేళ్లపాటు కోచింగ్‌ ఇచ్చేందుకు భారత మాజీ క్రికెటర్‌, మాజీ కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ను యూఏఈ నేషనల్‌ టీమ్‌కు హెడ్‌ కోచ్‌గా నియమించింది.

ఈ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ సామాన్యుడు కాదు.. టాలెంట్‌ను వెతికిపట్టుకోవడంలో ధిట్ట. ఆటగాళ్లలో సహజంగా ఉండే టాలెంట్‌కు మరింత పదును పెట్టి.. వారిని మెరికల్లాంటి స్టార్లుగా తీర్చుదిద్దుతుంటారు. ఈ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఇండియాకు వరల్డ్‌ కప్‌ అందించిన కోచ్‌ అంటే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. 2007లో మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా.. సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో టీమిండియాకు ఈ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌నే హెడ్‌ కోచ్‌గా ఉన్నాడు.

రాజ్‌పుత్‌ మరో గొప్ప లక్షణం ఏంటంటే.. ఇతను యంగ్‌ క్రికెటర్లలో ఉన్న టాలెంట్‌ను వెంటనే పసిగడతాడు. ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌కు సూపర్‌ స్టార్‌గా, ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ క్రికెట్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీ.. టీమిండియాలోకి రాకముందే.. అతను ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడని ఈ రాజ్‌పుత్‌ అప్పుడే చెప్పాడు. ఇదే విషయాన్ని ఈ మధ్యే హర్భజన్‌ సింగ్‌ కూడా తెలిపాడు. 2008లోనే కోహ్లీ గురించి తనకు లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ చెప్పినట్లు భజ్జీ వెల్లడించాడు. మరి అలాంటి మేటి కోచ్‌.. ఇప్పుడు యూఏఈ హెడ్‌ కోచ్‌గా వెళ్లడంతో ఆ జట్టుకి ఎంతో మేలు జరగనుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments