iDreamPost

డిప్యూటీ ఎమ్మార్వో సీటు కింద నోట్ల కట్టలు..

డిప్యూటీ ఎమ్మార్వో సీటు కింద నోట్ల కట్టలు..

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అంటే.. ప్రజలకు సేవ చేసేవారు. అయితే చాలా మంది అధికారులు మాత్రం తాము సేవకులం కాదు.. సేవ చేయించుకునే వారం అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. మరికొందరు అయితే అసలు మేము ఈ ఉద్యోగాల్లోకి వచ్చిందే అక్రమంగా డబ్బులు సంపాదించడానికి అన్నట్లు ప్రవర్తిస్తుంటారు.  ఎంత దారుణం అంటే.. సామాన్యులను జలగళ్లా పట్టి పీడిస్తుంటారు. అలా అవినీతి అధికారులు తరచూ మనకు వార్తల్లో కనిపిస్తుంటారు. తాజాగా ఓ అవినీతి అధికారి కూడా నోట్ల కట్టలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బులిస్తేనే సంతకం పెడతానని భీష్మించు కూర్చుంది. చివరకు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన రాయచూరులో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కర్ణాటక రాష్ట్రంలోని రాయాచూరు ప్రాంతంలోని ఓ మండల ఆఫీస్ లో అవినీతి తిమిగలం బయటపడింది. మామూళ్లు ముట్టజెప్పనిదే ఆ అవినీతి తిమింగలం పని చేసే ఆఫీస్ లో కాగితాలు ముందుకు కదలవు. ఓ మండలంలో ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా శశికళ అనే మహిళ విధులు నిర్వహిస్తుంది.  డబ్బులిస్తేనే సంతకం పెడతానని భీష్మించుకుని ఉంటుంది. అందుకే ఆమె పని చేస్తున్న ఆ కార్యాలయంలో కాగితాలు ముందుకు కదలాలంటే.. లంచం ఇవాల్సిందే. ఆమె మాముళ్ల మత్తులో మునిగిపోయారు. శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజల నుంచి డబ్బులు తీసుకున్నారు.

ఆమె డబ్బులు తీసుకుంటున్న దృశ్యం సోషల్ మీడియాలో  వైరల్ అయింది. ఆమె కూర్చొన్న సీటు కింద డ్రాయర్ లో రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి. ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సదరు మహిళా అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవినీతి అధికారుల వలన ఎందరో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇలాంటి వారికి ఉరిశిక్ష విధించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఇలాంటి అవినీతి అధికారులకు ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి