iDreamPost
android-app
ios-app

కోఠి ఉమెన్స్‌ కాలేజీ.. ఇక మహిళా యూనివ‌ర్సిటీ..!

కోఠి ఉమెన్స్‌ కాలేజీ.. ఇక మహిళా యూనివ‌ర్సిటీ..!

తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం ఉమ్మడి రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీగా అందుబాటులో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు మహిళా యూనివర్సిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది. రెండేళ్లలో శత వసంత ఉత్సవాలకు సిద్ధమవుతున్న హైదరాబాద్‌ కోఠి మహిళా కళాశాల.. తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీగా మారనుంది. 2018 మార్చిలో జాతీయ ఉన్నత విద్యా శిక్షా అభియాన్‌(రూసా) కింద కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చాలని భావించారు. అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి.. ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపారు. తర్వాత విమెన్స్‌ కాలేజీని సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ మహిళా కళాశాలలో ఒక్క పరిశోధనా సౌకర్యాలు మాత్రమే లేవని, విశ్వ విద్యాలయంగా మారితే పరిశోధనలు కూడా ప్రారంభమవుతాయని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.

మహిళా వర్సిటీ ఏర్పాటు కోసం రూ.50 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అప్పట్లో సుముఖత వ్యక్తం చేసింది. దీనికి అదనంగా మరో రూ.100 కోట్లు వెచ్చిస్తేనే.. సకల వసతులతో విశ్వవిద్యాలయంగా మార్చవచ్చని ఉస్మానియా వర్సిటీ అధికారులు అంచనాలు రూపొందించారు. కానీ ఆ తర్వాత పెండింగ్‌లో పడింది. అయితే ఉస్మానియా వర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్‌.. కోఠి ఉమెన్స్‌ కాలేజీకి రూ.37 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ ప్రతిపాదనతో మహిళా వర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

1924లో నిజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున సుమారు 42 ఎకరాల వైశాల్యంలో కోఠి విమెన్స్‌ కాలేజీ ఏర్పాటైంది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతోంది. 1998లో యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) హోదా లభించింది. మూడు సార్లు న్యాక్‌ గుర్తింపు దక్కించుకుంది కూడా. ప్రస్తుతం 57 అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు, 20 పీజీ కోర్సులు కొనసాగుతున్నాయి. కాలేజీలో 4,091 మంది రెగ్యులర్, 150 మంది డిప్లొమా, 17 మంది విదేశీ విద్యార్థినులు చదువుకుంటున్నారు. వంద మంది రెగ్యులర్, మరో 100 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయంగా మారితే.. ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఉన్న మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలన్నింటినీ కోఠి మహిళా వర్సిటీకి అనుబంధ కాలేజీలుగా మార్చే అవకాశాలున్నాయి.

Also Read : కేసీఆర్ ఇంటి ముందు హల్చల్.. జేసీ దివాకర్ రెడ్డి

Jojobet GirişmeritbetjojobetMeritbetcasibomJojobet GirişjojobetjojobetjojobetjojobetjojobetMadridbetMadridbetcasibom girişjojobet girişCasibom Girişmeritkinggalabetjojobetholiganbet girişholiganbet girişMarsbahis GüncelMarsbahis GirişMarsbahis Güncel Giriş