iDreamPost
android-app
ios-app

హీరో అజిత్‌ హెల్త్‌ అప్డేట్‌.. ఆస్పత్రికి ఎందుకు వెళ్లారంటే

  • Published Mar 08, 2024 | 12:18 PM Updated Updated Mar 08, 2024 | 12:18 PM

Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆరోగ్యం గురించి నిన్నటి నుంచి తీవ్ర చర్చంశనీయంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఆరోగ్యం పట్ల లెటెస్ట్ అప్ డేట్ అనేది ఇప్పుడు వైరల్ గా మారింది.

Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆరోగ్యం గురించి నిన్నటి నుంచి తీవ్ర చర్చంశనీయంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఆరోగ్యం పట్ల లెటెస్ట్ అప్ డేట్ అనేది ఇప్పుడు వైరల్ గా మారింది.

  • Published Mar 08, 2024 | 12:18 PMUpdated Mar 08, 2024 | 12:18 PM
హీరో అజిత్‌ హెల్త్‌ అప్డేట్‌.. ఆస్పత్రికి ఎందుకు వెళ్లారంటే

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆరోగ్యం గురించి నిన్నటి నుంచి తీవ్ర చర్చంశనీయంగా మారింది. కాగా, అజిత్ నిన్న చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఈ విషయం కాస్త తమిళనాట ఆందదోళనకరంగా మారింది. ముఖ్యంగా అజిత్ అభిమానులు ఆయనకి ఏమైందో అని చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు షూటింగ్ లో ఏమైనా దెబ్బతగిలి ఉంటుందా, ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమో అని రకరకాలు వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా అజిత్ ఆరోగ్య పట్ల నిన్నటి నుంచి వస్తున్న వార్తలకు ఆయన సన్నిహితుల నుంచి తాజా సమాచారం అందింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంకు సంబంధించిన లెటెస్ట్ అప్ డేట్ అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నిన్నటి నుంచి తమిళనాట అజిత్ ఆరోగ్యం పై తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసింది. ఈ విషయంలో అజిత్ అభిమానులు అతనికి ఏమైందోనని తెగ ఆందోళన పడ్డారు. అయితే తాజాగా అజిత్ ఆరోగ్యం పై ఆయన సన్నిహితుల నుంచి ఓ సమాచారం అందింది. కాగా, అజిత్ ఆరోగ్యం పట్ల ఫ్యాన్స్ ఏమాత్రం టెన్షన్ పడక్కర్లేదని, ఆయన పూర్తి క్షేమంగా ఉన్నారని తెలిసింది.అలానే అజిత్ రెగ్యులర్ కార్డియక్, న్యూరో చెకప్ లు చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లారని తెలుస్తోంది. ఇక ఈ సమాచారం అందిన తర్వాత అజిత్ అభిమానులకు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. దీంతో పాటు తన అభిమాన హీరో ఎటువంటి ఆరోగ్య సమస్యకు గురి కాలేదని తెలియడంతో చాలా సంతోష పడ్డారు.

కాగా, ప్రస్తుతం అజిత్ తన తదుపరి యాక్షన్ డ్రామా మూవీ విదా ముయరాచి లో నటిస్తున్నారు. అలాగే తదుపరి మేజర్ షూటింగ్ షెడ్యూల్ కోసం త్వరలో అజర్‌బైజాన్‌కు అజిత్ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక అజిత్ విషయానికొస్తే.. ఈయన పేరుకు తమిళ్ హీరో అయిన తెలుగులో అందరికి సుపరిచితమే. అలాగే, అజిత్ తెలుగు, తమిళ్, మళయాలం, కన్నడ , ఆంగ్ల భాషల్లో ఎంతో సునాయాసంగా మాట్లాడగలరు. అంతేకాకుండా..ఇండస్ట్రీలో యంగ్ హీరోలకుు ధీటుగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇక ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో లవర్ భాయ్ గా ఆమ్మాయిల మనసు దోచేశారు అజిత్. దీంతో పాటు అనేక సూపర్ హిట్ చిత్రల్లో నటిస్తూ అప్పటిలో చిత్ర పరిశ్రమను ఊపు ఊపేసిన ఘనత అజిత్ కు సొంతం.ఇక 52ఏళ్ల వయసున్న అజిత్.. జుట్టు తెల్లబడుతున్నా, ఏమాత్రం ఆయన జోష్ తగ్గకుండా ఆద్భుతంగా నటిస్తున్నారు.ఈయనకి కోలీవుడ్ లోనే కాకుండా.. టాలీవుడ్ లో కూడా చాలా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. మరి, అజిత్ ఆరోగ్యం పై వచ్చిన లెటెస్ట్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbet