నా కుటుంబం నా మీదే ఆధారపడి ఉంది.. KKR ఆటగాడి భావోద్వేగం..

తాజాగా జరిగిన లక్నో, KKR మ్యాచ్ లో లక్నో భారీ పరుగులు చేసి గెలిచినా KKR తరపున చివరి ఓవర్లలో వీరోచితంగా పోరాడి రింకూ సింగ్ కేవలం 15 బంతులతో 40 పరుగులు చేశాడు. కానీ చివర్లో KKR కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. రింకూ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన ఓ పేద కుటుంబం నుంచి వచ్చాడు. జీవనోపాధి కోసం గతంలో స్టేడియంలో స్వీపర్‌గా కూడా పనిచేసిన రింకూ కష్టపడి క్రికెటర్‌ అయ్యాడు. దేశవాళీ టోర్నీల్లో అతని ప్రదర్శనతో KKR
దృష్టిని ఆకర్షించి 2018లో IPLలో అడుగుపెట్టాడు.

రింకూ సింగ్‌ మాట్లాడుతూ.. KKRలో నా మొదటి సీజన్ అంతగా ఆడకపోయినా నా మీద నమ్మకంతో నన్ను మళ్ళీ తీసుకుంది. గతేడాది విజయ్‌ హజారే ట్రోఫీ జరిగిన సమయంలో నేను గాయపడ్డాను, నాకు ఆపరేషన్ అవసరమని, కోలుకోవడానికి 6 నుంచి 7 నెలలు పడుతుందని చెప్పారు. ఆటకు అన్ని రోజులు దూరంగా ఉండాలంటే నా వల్ల కాలేదు. కానీ మా కుటుంబం మొత్తం నా మీదే ఆధారపడి ఉంది. ఆ సమయంలో మేము మళ్ళీ చాలా గడ్డు రోజులని అనుభవించాము.

నాకు అలా జరగడంతో మా నాన్న చాలా బాధపడ్డారు. కొన్ని రోజులు సరిగ్గా తిండి కూడా తినలేదు. మా నాన్నని, నా పరిస్థితులని చూసి త్వరగా కోలుకోవాలని ఎంత కష్టమైనా సరే కోలుకున్నాను. ఇప్పుడు మళ్ళీ KKR నా మీద నమ్మకం ఉంచి తీసుకుంది. అందుకే నా ఆటని టీంకి ఉపయోగపడేలా చేయాలి అనుకొని ఆడుతున్నాను అని తెలిపాడు.

Show comments