iDreamPost
android-app
ios-app

ధైర్యంగా ముందడుగు వేసిన కెజిఎఫ్ 2

  • Published Aug 26, 2020 | 7:47 AM Updated Updated Aug 26, 2020 | 7:47 AM
ధైర్యంగా ముందడుగు వేసిన కెజిఎఫ్ 2

కరోనా భయంతో షూటింగులు చేయాలా వద్దా అనే మీమాంసలో ఉన్న పెద్ద హీరోలకు, పాన్ ఇండియా సినిమా యూనిట్లకు ధైర్యం ఇచ్చేలా కెజిఎఫ్ 2 టీం ధైర్యంగా ముందడుగు వేసింది. ఇవాళ బెంగుళూరు కంఠీరవ స్టూడియోలో బాలన్స్ షూట్ ని మొదలుపెట్టెసింది. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ కూడా జాయిన్ అయ్యారు. ఫస్ట్ పార్ట్ కెజిఎఫ్ కథ చెబుతూ కనిపించే కీలకమైన అనంత నాగ్ పాత్రను ఈయన రీ ప్లేస్ చేసినట్టుగా వినికిడి. ఆరోగ్య కారణాల దృష్ట్యా అనంత్ నాగ్ రాలేని పరిస్థితిలో ఉండటంతో దానికి అనుగుణంగా ఓ కీలకమైన మార్పుని స్క్రిప్ట్ లో జోడించినట్టు వినికిడి.

టీవీ ఛానల్ లేడీ ఎడిటర్ గా ఉన్న కాసేపు దడదడలాడించిన మాళవిక అవినాష్ మాత్రం అలాగే కొనసాగనున్నారు. ఇప్పుడు చిత్రీకటించిన సన్నివేశం కూడా వాళ్ళ మధ్య సంభాషణే. కెజిఎఫ్ ఓపెనింగ్ సీన్స్ లో ఇది చాలా కీలకమైన పార్ట్ గా నిలవడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. క్లైమాక్స్ తో పాటు ఇంకొన్ని సన్నివేశాలు మొత్తం కెజిఎఫ్ 2 లాక్ డౌన్ కు ముందే పూర్తయిపోయింది. ఇప్పుడు సంజయ్ దత్ హెల్త్ దృష్ట్యా అతను పాల్గొనాల్సిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయో లేవో తెలియాల్సి ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అవి ఆల్రెడీ తీసేశారని, ఒకటి రెండు షాట్స్ కి విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో తీసుకోవచ్చని అంటున్నారు. దీనికి సంబంధించిన క్లారిటీ త్వరలో రానుంది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనాటాండన్ తో పాటు మన తెలుగు నుంచి రావు రమేష్ లాంటి సీనియర్లు కూడా ఎందరో ఈ సీక్వెల్ లో భాగమయ్యారు.

ఇంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కెజిఎఫ్ 2నే షూటింగ్ కి వెళ్లిపోయింది కాబట్టి ఇక మిగిలిన వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వస్తారేమో చూడాలి. అయితే ఇక్కడో విషయం మర్చిపోకూడదు. అన్ని సినిమాలు ఇదే స్టేజిలో లేవు. కొన్ని అవుట్ డోర్ లో చేయాల్సినవి, కొన్ని ఆర్టిస్టులు ఎక్కువగా అవసరం ఉన్నవి చాలా ఉన్నాయి. కాబట్టి అన్నింటితో పోలిక పెట్టలేం. ఏది ఎలా ఉన్నా సౌత్ లో లాక్ డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకున్న పాన్ ఇండియా మూవీ మాత్రం ఇదే. ఈ స్ఫూర్తితో ఇంకొందరు ముందుకు వచ్చి దేవుడి దయ వల్ల కరోనా కేసులు కూడా తగ్గిపోతే మెల్లగా ఇండస్ట్రీ పోగొట్టుకున్న కళ తిరిగి వస్తుంది. అది జరగాలనే ప్రతిఒక్కరి ఆకాంక్ష. కెజిఎఫ్ 2 కనక అక్టోబర్ లోగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంటే 2021 సంక్రాంతికి వచ్చే అవకాశాలు పెరుగుతాయి

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet