iDreamPost
android-app
ios-app

KGF2 collections: 2 రోజుల్లో 100 కోట్లు – షాకవుతున్న బాలీవుడ్

  • Published Apr 16, 2022 | 4:14 PM Updated Updated Apr 16, 2022 | 4:14 PM
  • Published Apr 16, 2022 | 4:14 PMUpdated Apr 16, 2022 | 4:14 PM
KGF2 collections: 2 రోజుల్లో 100 కోట్లు – షాకవుతున్న బాలీవుడ్

కెజిఎఫ్ 2 వసూళ్లు చూసి ఇదెక్కడి మాస్ ర్యాంపేజ్ అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. ఒక సౌత్ మూవీ అందులోనూ మూడేళ్ళ క్రితం బయట మార్కెట్టే లేని కన్నడ డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుంటే వాళ్ళు షాక్ కి గురి కావడం సహజం. కేవలం రెండు రోజుల్లోనే కెజిఎఫ్ 2 హిందీ వెర్షన్ 100 కోట్ల మార్కు అందుకోవడం నిజంగానే ఎవరూ ఊహించని అతి పెద్ద సంచలనం.

ఏప్రిల్ 14న మొదటి రోజు సుమారు 54 కోట్ల దాకా రాబట్టగా రెండో రోజు అంటే నిన్న శుక్రవారం 47 కోట్ల దాకా తెచ్చేసింది. ఈ రోజు రేపూ వీకెండ్ కాబట్టి డబుల్ సెంచరీ నమోదయ్యే ఛాన్స్ ఈజీగా కనిపిస్తోంది. ఈ ఫీట్ ని గతంలో బాహుబలి 2, దంగల్ లాంటి బ్లాక్ బస్టర్స్ కూడా చేయలేకపోయాయి. కేవలం 48 గంటల వ్యవధిలో నాన్ హిందీ మూవీ ఇది సాధించడమంటే మాటలు కాదుగా.

ఫైనల్ గా కెజిఎఫ్ 2 ఆర్ఆర్ఆర్, బాహుబలి 2లను దాటుతుండగా లేదా అనేది అప్పుడే చెప్పలేం కానీ సూచనలైతే కనిపిస్తున్నాయి. ఇప్పుడీ తాకిడి ఎన్ని రోజులు ఉంటుందన్నది కీలకంగా మారింది. ఒకవేళ సోమవారం నుంచి కూడా డ్రాప్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటే మాత్రం రాఖీ భాయ్ బాక్సాఫీస్ బ్యాటింగ్ ఇంకో లెవెల్ లో ఉంటుంది. అసలే దగ్గరలో ఏ పోటీ సినిమాలు లేవాయే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet