iDreamPost
iDreamPost
గత నాలుగు రోజులుగా కరాటే కళ్యాణి పేరు వార్తల్లో ఉంది. ప్రాంక్ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై అర్ధరాత్రి గొడవకి వెళ్లడం, ఆ తర్వాత ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చుకోవడం, మరి కొంతమంది వ్యక్తులు కళ్యాణి మీద ఫిర్యాదు చేయడం, కళ్యాణి చిన్న పిల్లలని కిడ్నాప్ చేస్తుందని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంటికెళ్ళడం, ఆమె కనపడకుండా పోవడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరగడంతో కరాటే కళ్యాణిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇవాళ మే 16న కళ్యాణి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది.
ఈ ప్రెస్ మీట్ లో కళ్యాణి మాట్లాడుతూ.. నేను పిల్లలు ఎత్తుకెళ్ళాను, ఇంకా ఏదేదో అన్నారు. నాకు అన్యాయం జరుగుతుంది. నేను చాలా మందిని ప్రశ్నిస్తాను, తప్పు చేస్తే ఊరుకోను అందుకే నన్ను ద్వేషిస్తారు. నేను తప్పు చేస్తే క్షమాపణ అడగడానికి కూడా రెడీనే. నేను పిల్లలతో వ్యాపారం చేస్తున్నాను అనే వారు ప్రూఫ్స్ చూపించండి. ఒక్క ఆడదాన్ని చేసి ఇన్ని రకాలుగా దాడి చేస్తున్నారు. నా మీద దొంగ కేసులు పెడుతున్నారు. నేను సాయం చేయాలని చూస్తాను అందరికి. నేను పారిపోలేదు, పరిగెత్తిస్తాను.
నాకు పిల్లలు లేరు. పెళ్లి చేసుకొని విడిపోయాను. నాకు పిల్లలు అంటే ఇష్టం. నాకు పిల్లలు పుట్టరు కాబట్టి ఇలా పెంచుకుంటాను. చిన్నప్పటి నుంచి నాకు చెల్లెల్లు లేరు, ఇద్దరూ తమ్ముళ్లే. నాకు ఆడ పిల్లలు అంటే ఇష్టం. నేను ఈ అమ్మాయిని దత్తత తీసుకోలేదు. ఒప్పుకుంటాను. కానీ దత్తత తీసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే ఒక సంవత్సరం వరకు దత్తత తీసుకోకూడదు రూల్స్ ప్రకారం. అని చెప్పి ఆ పాప తల్లి తండ్రులని పరిచయం చేసింది. ఆ పాప తండ్రి మాట్లాడుతూ.. మా దగ్గర డబ్బులు లేక అక్కకి పెంచడానికి ఇచ్చాము. అక్క మంచిగా చూసుకుంటుంది. పాప బాగుండాలి. అందరూ పారిపోయింది, కిడ్నాప్ చేశారు అన్నారు. కానీ అక్క నిన్న మా ఇంటికి వచ్చి జరిగిన పరిస్థితి చెప్పింది. అందుకే మేము అక్క తరపున మాట్లాడటానికి వచ్చాము.
ఎవరో వెధవలు నా మీద ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీని వెనక చాలా మంది పెద్దలు ఉన్నారు. ఆ పాప తల్లి తండ్రులు కూడా అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తున్నారు. వాళ్లే చెప్పారు నేను బాగా చూసుకుంటాను అని. ఇకపై కూడా వీళ్ళు నా దగ్గరే ఉంటాను. నేనే సంవత్సరం తర్వాత పాపని అధికారికంగా దత్తత తీసుకుంటాను. మా ఇంటికొచ్చి మొత్తం వెతుక్కోండి. ఒక రోజంతా ఉంది నేను ఏం చేస్తానో తెలుసుకొని రాయండి. యూట్యూబ్ ఛానల్స్ పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెట్టొద్దు ఏమి తెలియకుండా.
నేను దాడి చేయడానికి వెళ్ళలేదు శ్రీకాంత్ దగ్గరికి. మాట్లాడదామని వెళ్ళాను. వాడో బచ్చాగాడు, నా అనుభవం అంత ఉండదు వాడి వయసు. కానీ అక్కడ జరిగిన పరిస్థితుల వల్ల కొట్టాను. ఇంకొకడు ఇల్లు విషయంలో నేను ఇల్లు కొనడానికి డబ్బులు ఇస్తే ఇల్లు ఇవ్వకుండా నన్ను ఏడిపించాడు. వాడు ఇవాళ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. అది ఆల్రెడీ పోలీస్ కేసు అయింది. పోలీసులు కూడా వాడినే తిట్టారు. రాంగ్ థంబ్ నెయిల్స్ పెట్టే వాళ్ళందరి మీద పోరాటం చేస్తాను. ఎవ్వరిని వదలను అని తెలిపింది.
చివరగా రేపు పోలీసులని, కలెక్టర్ ని, మరి కొంతమంది ఆఫీసర్లని కలుస్తానని, నేను ఏ తప్పు చేయలేదని చెప్పింది. మరి ఆమెపై నిందలు వేసిన వారు ఏం మాట్లాడతారో చూడాలి. మొత్తానికి చిలికి చిలికి పెద్ద వివాదంగా మారుతుంది ఈ కళ్యాణి టాపిక్.