iDreamPost
android-app
ios-app

పరారీలో కరాటే కళ్యాణి! తప్పు చేసినందుకేనా?

  • Published May 16, 2022 | 4:56 PM Updated Updated May 16, 2022 | 8:36 PM
పరారీలో కరాటే కళ్యాణి! తప్పు చేసినందుకేనా?

గత నాలుగు రోజులుగా కరాటే కళ్యాణి పేరు వార్తల్లో నిలుస్తుంది. ప్రాంక్ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై అర్ధరాత్రి గొడవకి వెళ్లడం, ఆ తర్వాత ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చుకోవడం, మరి కొంతమంది వ్యక్తులు కళ్యాణి మీద ఫిర్యాదు చేయడం, కళ్యాణి చిన్న పిల్లలని కిడ్నాప్ చేస్తుందని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంటికెళ్ళడం, ఆమె కనపడకుండా పోవడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరగడంతో కరాటే కళ్యాణిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ద‌త్త‌త పేరుతో కరాటే కళ్యాణి పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణాకు పాల్పడుతుందని, పిల్లల్ని కిడ్నాప్ చేస్తుందని ఫిర్యాదు రావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ఆ సమయంలో కళ్యాణి ఇంట్లో లేదు. అక్కడ ఉన్న పిల్లల గురించి కళ్యాణి తల్లి, సోదరుడు సరైన వివరాలు చెప్పకపోవడంతో కళ్యాణి పై కేసు నమోదు చేశారు.

ఇక కళ్యాణి తల్లి తన కూతురు, ఆమెతో పాటు దత్తత తీసుకున్న అయిదు నెలల పాప మౌక్తిక కనిపించటం లేదని, కళ్యాణిపై లేని పోనీ నిందలన్నీ మోపుతున్నారని, శ్రీకాంత్ రెడ్డి కల్యాణిని బెదిరించారని మీడియాతో తెలిపింది. అయితే నిన్నటి నుంచి కరాటే కళ్యాణి కనపడకపోవడంతో మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగానే కళ్యాణి తప్పు చేసిందా? పిల్లల దత్తత విషయంలో ఏదైనా తప్పు ఉందా? లేక శ్రీకాంత్ రెడ్డి కేసులో భయపడుతోందా? అసలు ఎందుకు కళ్యాణి దాక్కుంది? ఎక్కడ దాక్కుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కళ్యాణి కనపడకపోవడంతో కళ్యాణి కచ్చితంగా తప్పు చేసే ఉంటుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కళ్యాణి కోసం గాలిస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler