iDreamPost
android-app
ios-app

నా భార్య నమిత అక్రమ సంబంధం పెట్టుకుంది.. ప్రముఖ నిర్మాత ఆరోపణలు!

నా భార్య నమిత అక్రమ సంబంధం పెట్టుకుంది.. ప్రముఖ నిర్మాత ఆరోపణలు!

డ్రగ్స్ కేసులు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. గతంలో టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు ఓ ఊపు ఊపేసింది. ఆ సమయంలో పలువు సెలబ్రిటీలను అధికారులు విచారణ చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో డ్రగ్స్ కేసు బయటకి వచ్చింది. తాజాగా టాలీవుడ్ లో కెపీ చౌదరి ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కన్నడ సినీ ఇండస్ట్రీని కూడా డ్రగ్స్ భూతం పట్టిపీడిస్తోందంట. ఈనేపథ్యంలో కన్నడ సినీ నిర్మాత  చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య నమిత డ్రగ్స్ భానిస మారి.. అక్రమ సబంధం కూడా నడిపిస్తోందని ఆయన ఆరోపించారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు నిర్మిస్తూ టి.చంద్రశేఖర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించాడు. ఆయన రెండేళ్ల క్రితం నమితను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి బెంగళూరులోని బనశంకరి కాపురం ఉంటున్నారు. చాలా కాలం పాటు వీరి సంసారం ఎంతో సంతోషంగా సాగింది.  ఈక్రమంలో చంద్రశేఖర్.. తన భార్యపై సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య డ్రగ్స్ కి అలవాటు పడిందని, ఎన్నిసార్లు వద్దని వారించినా.. నిదానంగా చెప్పినా వినలేదన్నారు.

అంతే కాదు ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసే లక్ష్మీశ్ ప్రభు అనే వ్యక్తితో వివాహేతర సబంధం  పెట్టుకుందని తెలిపారు.  ఓసారి ఇంట్లో రెడ్ హ్యండెడ్ గా ఇద్దరు దొరికిపోయారని చంద్రశేఖర్ తెలిపారు. వారు చేసిన పనిపై ప్రశ్నించినప్పుడు తనపై దాడికి దిగారని చంద్రశేఖర్ ఆరోపించారు. అంతే కాదు.. వారిద్దరిపై బెంగళూరులోని చెన్నమ్మనకేరే అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.  ప్రస్తుతం ఈయన చేసిన ఆరోపణలు కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి. ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss