iDreamPost
android-app
ios-app

వికటించిన దంతవైద్యం.. గుర్తుపట్టలేని విధంగా తయారైన హీరోయిన్

  • Published Jun 20, 2022 | 9:20 AM Updated Updated Jun 20, 2022 | 9:20 AM
వికటించిన దంతవైద్యం.. గుర్తుపట్టలేని విధంగా తయారైన హీరోయిన్

దంతవైద్యం వికటించడంతో ఓ హీరోయిన్ ముఖం ఊహించని విధంగా మారిపోయింది. ఆమెను ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా తయారైంది. కన్నడ నటి స్వాతి సతీష్ పరిస్థితి ఇది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన స్వాతి సతీష్ ఇటీవల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు డెంటల్ క్లినిక్ కు వెళ్లింది. రూట్ కెనాల్ చికిత్స చేయించుకుంది. ఆ తర్వాతే స్వాతి ముఖం భయంకరంగా తయారైంది. ముఖం వాచిపోవడంతో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. తీవ్రమైన నొప్పికి తోడు.. ఆమె ముఖం అందవిహీనంగా ఉండటంతో.. పలు సినిమా ఛాన్సులు కూడా వెనక్కి వెళ్లిపోయాయట.

తనకు తప్పుడు వైద్యం చేశారని స్వాతి సతీష్ ఆరోపిస్తోంది. బెంగళూరులోని ఓ డెంటల్ క్లినిక్ లో రూట్ కెనాల్ చేయించుకునేందుకు వెళ్లగా.. ట్రీట్మెంట్ సమయంలో అనస్తీషియాకు బదులు సాల్సిలిక్ యాసిడ్ ఇచ్చి ఉంటారని, అందుకే స్వాతి ముఖం అలా వాచిపోయి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖమంతా వాచిపోవడంతో స్వాతి సతీష్ మరో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. సమస్య నుంచి కోలుకున్న అనంతరం డెంటల్ క్లినిక్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా.. స్వాతి సతీష్ కన్నడలో 6 టు 6 ఎఫ్ఐఆర్ తో పాటు.. పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

 

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetewin girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis