iDreamPost
android-app
ios-app

చార్లీ సినిమాపై పోస్ట్ పెట్టిన హీరోయిన్.. అసభ్య కామెంట్లు పెడుతున్న నెటిజన్.. పోలీసులకి ఫిర్యాదు..

  • Published Jun 10, 2022 | 8:37 PM Updated Updated Jun 10, 2022 | 9:09 PM
  • Published Jun 10, 2022 | 8:37 PMUpdated Jun 10, 2022 | 9:09 PM
చార్లీ సినిమాపై పోస్ట్ పెట్టిన హీరోయిన్.. అసభ్య కామెంట్లు పెడుతున్న నెటిజన్.. పోలీసులకి ఫిర్యాదు..

అభిమన్యు సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది నటి రమ్య. కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు సినిమాలలో, డబ్బింగ్ సినిమాలలో కూడా కనిపించి మెప్పించింది. కన్నడ, తెలుగు, తమిళ్ లో సినిమాలు చేసిన రమ్య తర్వాత సినిమాలకి దూరమై పాలిటిక్స్ లో చేరి ఎంపీ కూడా అయింది. ఆ తర్వాత పాలిటిక్స్ నుంచి కూడా తప్పుకుంది. ప్రస్తుతం అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపిస్తుంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రమ్య తాజాగా ఇవాళ రిలీజైన కన్నడ హీరో రక్షిత్ శెట్టి సినిమా చార్లీ 777 చూసింది. సినిమా గురించి స్పందిస్తూ చాలా బాగుందని, హార్ట్ టచింగ్ లా ఉందని సినిమాని, చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. అయితే ఆమె పోస్ట్ కి ప్రీతమ్‌ ప్రిన్స్‌ అనే ఓ నెటిజన్ అసభ్యంగా కామెంట్స్ చేశాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలంటూ రమ్య పోలీసులను కోరింది.

ప్రీతమ్‌ ప్రిన్స్‌ అనే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తను షేర్ చేసుకున్న ఫొటోలపై అసభ్య కామెంట్లు పెడుతున్నాడని, గతంలో కూడా ట్రోల్ చేశాడని, ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదులో తెలిపి అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులను కోరింది. బెంగళూరు పోలీసు స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş