Dharani
టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాన్‌ల మీద.. ఓ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారి సినిమాల వల్ల తనకు అన్యాయం జరిగిందని వాపోయాడు. ఆ వివరాలు..
టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాన్‌ల మీద.. ఓ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారి సినిమాల వల్ల తనకు అన్యాయం జరిగిందని వాపోయాడు. ఆ వివరాలు..
Dharani
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకరు.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల మీద సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరి వల్ల తనకు అన్యాయం జరిగింది అంటున్నాడు. ఇద్దరు స్టార్ హీరోల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో సంచలనంగా మారింది. ఇంతకు ఎవరా ఆర్టిస్ట్.. ఎందుకతడు చిరు, పవన్‌ల మీద ఇలాంటి ఆరోపణలు చేశాడు.. వారి వల్ల అతడికి జరిగిన నష్టం ఏంటో తెలియాంలంటే ఇది చదవాలి.
ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల మీద ఆరోపణలు చేసిన నటుడి పేరు కిశోర్ కుమార్. పేరు చెప్తే గుర్తు పట్టడం కానీ.. కేరాఫ్ కంచరపాలెం సినిమాలో అతడు చేసిన పాత్ర గురించి చెబితే టక్కున గుర్తు పడతారు. ఈ సినిమాలో వినాయకుడి బొమ్మలు చేసే మూగ వ్యక్తి పాత్రలో నటించిన వ్యక్తే కిశోర్ కుమార్. మూవీలో ఇతడు చేసిన పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా తర్వాత అతడికి అనేక అవకాశాలు లభించాయి.
అనేక చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో యాక్ట్ చేశాడు. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’లో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడు చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరి నటుల చిత్రాల వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
చిరు ‘ఆచార్య’, పవన్ ‘భీమ్లా నాయక్’ చిత్రాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కిషోర్ కుమార్. తనకు ఈ సినిమాల్లో పాత్రలు ఇచ్చారని.. షూటింగ్ కూడా పూర్తి చేశారని.. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. తన సీన్స్ తీసేశారని.. అలా ఎందుకు చేశారో తనకు ఇప్పటికి అర్థం కాలేదని వాపోయాడు. ఈ విషయంలో చాలా బాధపడ్డానని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి.
ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి ఆచార్య సినిమాలో నాకో పాత్ర ఇచ్చారు. దాని కోసం 20 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. బాగా చేశానని చిరంజీవి కూడా మెచ్చుకున్నారు. భుజంపై చేయి వేసి మరీ మాట్లాడేవారు. తీరా మూవీ విడుదలయ్యాక ఆచార్య సినిమాలో నా సీన్స్ కనిపించలేదు. ఎడిటింగ్‌లో తీసేశారు. అలానే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ కోసం ఓ రోజు షూటింగ్‌కి వెళ్లాను. ఆ తర్వాత కాస్త గ్యాప్ వచ్చింది. దాంతో నా బదులు వేరే నటుడిని ఆ పాత్ర కోసం తీసుకున్నారు. ఎందుకలా చేశారో అర్థం కాలేదు. ఈ రెండు సినిమాల విషయంలో చాలా బాధపడ్డాను’’ అని చెప్పుకొచ్చాడు.
వైజాగ్‌కి చెందిన కిశోర్ కుమార్.. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో నటుడిగా మారాడు. ఈ మూవీ అప్పట్లో ఒక సంచలనం. పెద్దగా పరిచయం లేని నటీనటులతో, తక్కువ బడ్జెట్‌తో కంచరపాలెం మూవీ తెరకెక్కింది. అద్భుతమైన స్క్రీన్ ప్లే కేరాఫ్ ఈ చిత్రాన్ని గొప్పగా మార్చింది. వెంకటేష్ మహా ఈ మూవీకి దర్శకుడు. ఈ సినిమా విమర్శకులు ప్రశంసలు దక్కించుకుంది.