iDreamPost
android-app
ios-app

కమల్ హాసన్ ఆస్తి ఎంతో తెలుసా? లండన్ లో కమల్ హాసన్ ఆస్తులు ఉన్నాయని తెలుసా??

  • Published Jun 07, 2022 | 7:45 PM Updated Updated Jun 07, 2022 | 7:45 PM
  • Published Jun 07, 2022 | 7:45 PMUpdated Jun 07, 2022 | 7:45 PM
కమల్ హాసన్ ఆస్తి ఎంతో తెలుసా? లండన్ లో కమల్ హాసన్ ఆస్తులు ఉన్నాయని తెలుసా??

స్టార్ హీరో, లోకనాయకుడు కమలహాసన్ ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. బాల నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టి హీరోగా మారి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత నిర్మాతగా కూడా మారారు. తాజాగా కమల్ హాసన్ హీరోగా, నిర్మాతగా విక్రమ్ సినిమా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో కమల్ కి బాగానే లాభాలు వస్తున్నాయి. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. దీంతో మరోసారి కమల్ హాసన్ ఆస్తుల గురించి ఆరా మొదలు పెట్టారు జనాలు.

కమల్ కి చెన్నైలోనే కాక, తమిళనాడులో కొన్ని ప్రదేశాల్లో అలాగే ఇంగ్లాండ్ లో కూడా బాగానే ఆస్తులు ఉన్నాయి. ఇటీవల కమల్ రాజకీయాల వల్ల తన ఆస్తుల లెక్క చెప్పాల్సిరావడంతో కమల్ తన వ్యక్తిగత ఆస్తిని 177 కోట్లుగా చూపించినట్లు తెలుస్తుంది. చెన్నైలోని రెసిడెన్షియల్ సొసైటీలలో ఓ రెండు ఫ్లాట్‌ల విలువ దాదాపు రూ. 19.5 కోట్లు ఉంది. అలాగే తమిళనాడులోని ఇతర ప్రదేశాల్లో కమల్ కి ఇల్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. వాటి లెక్క దాదాపు రూ. 92.5 కోట్లు. అలాగే కమల్ కి దాదాపు 17 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ భూమి కూడా ఉందని తన ఆస్తుల వివరాల్లో ప్రకటించారు.

ఇక కమల్ హాసన్ చుట్టాలు చాలా మంది లండన్ లో ఉన్నారు. కమల్ కూడా రెగ్యులర్ గా లండన్ వెళ్లి వస్తూ ఉంటారు. దీంతో కమల్ అక్కడ ఇంగ్లాండ్ లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. ఇంగ్లాండ్ లో దాదాపు 3 కోట్ల విలువైన స్థిరాస్థులు కమల్ కి ఉన్నట్టు సమాచారం. అలాగే కమల్ దగ్గర ఒక BMW కారు,ఒక లెక్సస్ కారు ఉన్నాయి. వీటి ఖరీదు దాదాపు 3 కోట్ల వరకు ఉంటుంది. ఇక కమల్ ఇటీవలే చెన్నైలోని తన రాజభవనం లాంటి ఇంటిని బాగా ఖర్చుపెట్టి రిపేర్ చేసినట్టు సమాచారం. అయితే ఇవన్నీ ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ. ఇవి కాకుండా ఆయన నిర్మాణ సంస్థ, రాజకీయ పార్టీ పేరు మీద కూడా కొన్ని ఆస్తులు ఉన్నట్టు సమాచారం.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio