iDreamPost
android-app
ios-app

ఆ ఇద్దరికీ బహిరంగ క్షమాపణ చెప్పిన నటి కల్పిక గణేష్‌!

  • Published Jul 03, 2023 | 5:31 PM Updated Updated Jul 03, 2023 | 5:31 PM
  • Published Jul 03, 2023 | 5:31 PMUpdated Jul 03, 2023 | 5:31 PM
ఆ ఇద్దరికీ బహిరంగ క్షమాపణ చెప్పిన నటి కల్పిక గణేష్‌!

కల్పిక గణేష్‌.. సినిమాలలో నటనతో కంటే.. బయట కాంట్రవర్సీలతోనే ఎక్కువ పాపులర్‌ అయ్యారు ఈ నటి. తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారీమె. గతంలో ప్రముఖ తమిళ దర్శకుడు బాలాజీ మోహన్‌- నటి ధన్యా బాలక్రిష్ణన్ వ్యక్తిగత జీవితంపై కల్పిక కామెంట్లు చేశారు. బాలాజీ మోహన్‌.. భార్య ఉండగానే ధన్యతో ఎఫైర్‌ పెట్టుకున్నాడని ఆమె ఆరోపించారు. వారిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారంటూ బాంబు పేల్చారు. దీంతో అప్పట్లో బాలాజీ మోహన్‌- ధన్యా బాలక్రిష్ణన్‌ల పెళ్లిపై పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలోనే బాలాజీ తమ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తామిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

అనంతరం కల్పికపై మద్రాస్‌ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీంతో కల్పికకు చిక్కెదురైంది. కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టులు, కేసులు ఎందుకు అనుకున్న కల్పిక.. వెనక్కు తగ్గింది. బాలాజీ మోహన్‌- ధన్యలకు బహిరంగ క్షమాపణ చెప్పింది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ‘‘ హాయ్‌ నాపేరు కల్పికా గణేష్‌. తమిళ దర్శకుడు బాలాజీ మోహన్‌- నటి ధన్యా బాలక్రిష్ణన్‌లకు నేను క్షమాపణ చెబుతున్నా. నేను వారిపై తప్పుడు ఆరోపణలు చేశాను. వారి పరువు దిగదార్చే విధంగా నా సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టులు పెట్టాను. నేను వారిపై చేసిన ఆరోపణలన్నీ తప్పుడివే..

ఆ ఇద్దరికీ నా క్షమాపణలు. వాళ్లు నాకు ఎప్పుడూ ఏ చెడు చేయలేదు. వారి కుటుంబసభ్యులకు, ఫ్యాన్స్‌కు నా మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. నేను ఇకపై వారి గురించి ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడను’’ అని పేర్కొన్నారు. ఇక, కల్పిక బహిరంగంగా క్షమాపణలు చెప్పటంతో బాలాజీ పరువు నష్టం దావా కేసులో గెలిచినట్లు అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన కేసును వెనక్కు తీసుకున్నారు. మరి,  తమిళ దర్శకుడు బాలాజీ మోహన్‌- నటి ధన్యా బాలక్రిష్ణన్‌లపై కామెంట్లు చేసి ఇబ్బందులకు గురైన కల్పిన ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom