iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD OTT: భారీ ధరకి క‌ల్కి 2898 AD డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్.. ఏకంగా రెండు OTT ల్లోకి!

  • Published May 21, 2024 | 1:55 PM Updated Updated May 21, 2024 | 1:55 PM

థియేటర్ లో సినిమాలు రిలీజ్ అయిన తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ గురించి టాక్ నడుస్తుంది అంటే అది చాలా కామన్ విషయం అయిపొయింది. కానీ ఇప్పుడు ఇంకా సినిమా థియేటర్ లో స్ట్రీమింగ్ కాకాముందే ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి.

థియేటర్ లో సినిమాలు రిలీజ్ అయిన తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ గురించి టాక్ నడుస్తుంది అంటే అది చాలా కామన్ విషయం అయిపొయింది. కానీ ఇప్పుడు ఇంకా సినిమా థియేటర్ లో స్ట్రీమింగ్ కాకాముందే ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి.

  • Published May 21, 2024 | 1:55 PMUpdated May 21, 2024 | 1:55 PM
Kalki 2898 AD OTT: భారీ ధరకి క‌ల్కి 2898 AD డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్.. ఏకంగా రెండు OTT ల్లోకి!

ఇప్పుడు ఓటీటీ కి ఆదరణ పెరిగిపోయిందన్న విషయం అందరికి తెలిసిందే. చాలా వరకు థియేటర్ లో రిలీజ్ అయినా నెల వారం రోజుల లోపే ఓటీటీ బాట పట్టేస్తున్నాయి. ఇది ఇలా ఉంటె ఇంకా కొన్ని సినిమాలకైతే థియేటర్ లో రిలీజ్ కాకముందే. ఆయా సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే బజ్ మొదలైంది. ఈ సినిమా థియేటర్ రిలీజ్ ఏ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఏకంగా డిజిటల్ స్ట్రీమింగ్ టాక్ మొదలవ్వడంతో.. అందరు ఆశ్చర్య పోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలను చూసేద్దాం.

ప్రభాస్ అభిమానులతో పాటు.. మూవీ లవర్స్ అందరూ కూడా థియేటర్ లో ఓ మంచి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆశతో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఇప్పుడు రిలీజ్ కు దగ్గరగా ఉన్న సినిమా కల్కి 2898 AD. ఈ సినిమా తేలటికల్ రిలీజ్ డేట్ ఇప్పటికే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా రిలీజ్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారని చెప్పి తీరాలి. ఇక ఎట్టకేలకు ఈ సినిమాను జూన్ 27 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే, ఇక ఇపుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయట. పైగా రెండు ఓటీటీ లలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కల్కి ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ కలిపి 175 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోను స్ట్రీమింగ్ చేయనున్నారట. ఇక హిందీ వెర్షన్ ను మాత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారట మేకర్స్ .

కల్కి సినిమా కోసం ఎంతమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా జూన్ 27 న థియేటర్ లో రిలీజ్ కానుంది. అసలు గత నెల రోజులుగా థియేటర్ లో చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు కాబట్టి.. ఈ సినిమా లాంగ్ రన్ లో థియేటర్స్ లో ఒక ఊపు ఊపేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందులోను ప్రభాస్ సినిమా ఇక కలెక్షన్స్ విషయంలోనూ ఈ సినిమా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూడకుండా.. థియేటర్ లో రిలీజ్ అయినా తర్వాత ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి. మరి కల్కి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş