iDreamPost
android-app
ios-app

కాళీ పోస్ట‌ర్ ర‌గ‌డ‌, నాకెక్క‌డ భ‌ద్ర‌త‌లేదు, డైరెక్ట‌ర్ లీనా

  • Published Jul 07, 2022 | 8:03 PM Updated Updated Jul 07, 2022 | 8:03 PM
  • Published Jul 07, 2022 | 8:03 PMUpdated Jul 07, 2022 | 8:03 PM
కాళీ పోస్ట‌ర్ ర‌గ‌డ‌, నాకెక్క‌డ భ‌ద్ర‌త‌లేదు, డైరెక్ట‌ర్ లీనా

కెన‌డాలో కాళీ పోస్ట‌ర్ తో ఇండియాలో అగ్గిరేగింది. ఫిల్మ్ మేక‌ర్ లీనా మీద ఇండియాలో రెండు ఎఫ్ ఐఆర్ లు న‌మోదైయ్యాయి. నాకు ఎక్క‌డా భ‌ద్ర‌త‌లేద‌ని లీనా వాపోయింది. అతిపెద్ద ప్ర‌జాస్వామ్య‌క దేశం నుంచి దేశం మొత్త‌మే పెద్ద విద్వేష‌ యంత్రంగా మారిపోయింద‌ని గార్డియ‌న్ కిచ్చిన ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించింది.

నేపు పుట్టిన త‌మిళ‌నాడు గ్రామీణ ప్రాంతాల్లో, కాళీని మొక్క‌తాం. ఆమె గొర్రె రక్తంతో వండిన మాంస‌పు కూర‌ను తింటుంది. క‌ల్లు తాగుతుంది. బీడీలు కాల్చుతుంది. న‌చ్చిన‌ట్లు ఆడుతుంది. ఈ కాళీ మాత‌నే నేను సినిమాలో చూపించాన‌ని లినా చెబుతోంది.

ఆమె సినిమా పోస్ట‌ర్ లో కాళీ మాత సిగ‌రెట్ తాగుతుంది. ఆమె వెనుక ప్రైడ్ ఫ్లాగ్ ఉంది. ఇండియాలో గ‌గ్గోలు పుట్ట‌డంతో ఆమె ట్విట్ ను ట్విట్ట‌ర్ తొల‌గించింది.

త‌న సినిమా పోస్ట‌ర్ రాద్ధాంతంపై లీనా అంత‌కుముందే ట్వీట్ చేసింది. ఎలాంటి భ‌యంలేని గొంతును వినిపించాల‌నుకొంటున్నాను. ఒక‌వేళ దానికి నా ప్రాణమే మూల్య‌మైతే, ఇచ్చేస్తాన‌ని ట్వీట్ చేసింది.

వైర్ కిచ్చిన ఇంట‌ర్వ్యూలో, త‌మిళ‌నాడు, తెలుగు రాష్ట్రాల్లో భ‌క్తుల మీద‌కు పూన‌కంలా దేవ‌త‌ వ‌స్తుంది. మాంసం తింటుంది. గంజా తాగుతుంది. క‌ల్లు స్వీక‌రిస్తుంది. అలాంటి గ్రామ దేవ‌తే నా కాళీకి ప్రేర‌ణ‌ని లీనా చెప్పింది.


తాజాగా, లీనా మణిమేకలై.. మరో చిత్రాన్ని పోస్ట్ చేశారు. ‘ఎక్కడో..’ అంటూ క్యాప్షన్ చేశారు. జానపద థియేటర్ కళాకారులు తమ ప్రదర్శనల తర్వాత ఏం చేస్తారనేది BJP డ‌బ్బుతీసుకొనే ట్రోల్ ఆర్మీకి తెలియదు. ఇది నా సినిమాది కాదు. ఈ సంఘ్ పరివార్లు తమ కనికరంలేని ద్వేషం, మత దురభిమానంతో గ్రామీణ భార‌త‌దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదు అంటూ ట్వీట్ చేసింది లీనా మణిమేకలై.


లీనా మణిమేకలై కాళి పోస్ట‌ర్, ఆమె ట్వీట్లు సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీస్తున్నాయి. లీనాను చంపుతానని బెదిరించిన తమిళనాడుకు చెందిన శక్తి సేన హిందూ మక్కల్‌ ఐయ్యమ్‌ ప్రెసిడెంట్‌ సరస్వతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş