Jr NTR : ఎన్టీఆర్ బాలీవుడ్‌ ఎంట్రీ.. పీరియాడిక్ స్పెషలిస్ట్ పని మొదలుపెట్టారా?

  • Published - 11:56 AM, Sun - 24 October 21
Jr NTR : ఎన్టీఆర్ బాలీవుడ్‌ ఎంట్రీ.. పీరియాడిక్ స్పెషలిస్ట్ పని మొదలుపెట్టారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగు సినిమా రేంజ్ భారీగా పెరిగింది. తెలుగు హీరోలతో తమిళ దర్శకులు, తమిళ దర్శకులతో తెలుగు హీరోలు ఇలా భాషతో సంబంధం లేకుండా మార్కెట్ పరిధిని పెంచుకుంటూ ముందుకు వెళుతుంది. ప్రభాస్ లాంటి బడా హీరోల తో బాలీవుడ్ దర్శకులు సైతం సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ దర్శకుడు ఒక ఆసక్తి చూపిస్తున్నారని ఏడాది ముందు నుంచే ప్రచారం జరుగుతూ రాగా ఇప్పుడు అది దాదాపు ఖరారైనట్లే చెబుతున్నారు.

బాలీవుడ్ లో పద్మావత్, బాజీరావ్ మస్తానీ, దేవదాస్, రామ్ లీలా వంటి చారిత్రక సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నారని గత ఏడాది నుంచే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి దాకా క్లారిటీ లేదు కానీ ఇప్పుడు మకుట విఎఫ్ఎక్స్ సంస్థ ఈ పీరియాడిక్ డ్రామా కోసం స్కెచ్‌లను సిద్ధం చేస్తోందని అంటున్నారు. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇదే అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్పడనుండడంతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయని చెబుతున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ తో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన గంగూబాయి కతియావాడి ఒక రోజు గ్యాప్ తో విడుదల అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ జనవరి 7న, గంగూబాయి కతియావాడి జనవరి 6న విడుదల కానున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా చేయనున్నారు. అది పూర్తి కాగానే ఈ సినిమా లైన్ లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కధ ఏంటో తెలియదు కానీ సంజయ్ లీలా బన్సాలీ పీరియాడికల్ సినిమాలు తీయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో కొంతమంది ఔత్సాహిక తారక్ అభిమానులు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తమ హీరోతో చత్రపతి శివాజీ బయోపిక్ తీయాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏమవుతుంది అనేది.

Also Read : Bhajarangi : భజరంగిని తక్కువ అంచనా వేయడానికి లేదు

Show comments