iDreamPost
android-app
ios-app

ఏ న్యాయానికి సంకెళ్లు పడ్డాయి: జర్నలిస్ట్ సాయి

ఏ న్యాయానికి సంకెళ్లు పడ్డాయి: జర్నలిస్ట్ సాయి

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరెస్టైన సంగతి  తెలిసిందే. పక్కా ఆధారాలతో ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. కోర్టు కూడా సీఐడీ అధికారులు ఇచ్చిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అయితే చంద్రబాబు అరెస్ట్ అన్యాయమంటూ టీడీపీ నేతలు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాక చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తరచూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా న్యాయానికి సంకేళ్లు పేరిట మరో నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సాయి కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏ న్యాయానికి సంకెళ్లు పడ్డాయి. రూ.300 కోట్లు పక్కదారి మళ్లినందుకా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు తరచూ ఏదో ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. గతంలో పళ్లెలాలు  కొడుతు, కొవ్వొత్తులు వెలిగించి, నల్లరిబ్బన్లు చుట్టుకుంటూ నిరసనలు చేపట్టారు. తాజాగా చేతులకు సంకేళ్లు వేసుకుని టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే టీడీపీ నేతలు చేపట్టిన ఈ కార్యక్రమంలో అనేక విమర్శలు వస్తున్నాయి. స్కాం చేసి జైలుకు వెళ్తే.. న్యాయానికి సంకెళ్లు ఏంటి అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా ఇదే అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ ప్రముఖ జర్నలిస్ సాయి కీలక అంశాలను ప్రస్తావించారు.

ఆయన మాట్లాడుతూ..” ఏది న్యాయం, ఏది అన్యాయం.. న్యాయనికి సంకేళ్లు ఉద్యమం ద్వారా జనాల్లో వచ్చే ప్రశ్నే అది. ఏ న్యాయానికి సంకెళ్లు పడ్డాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీమెన్స్ కంపెనీ తనకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది. ఆ సంస్థ పేరుతో మరో టెక్ సంస్థకు నిధులు ఇవ్వడం అనేది న్యాయమా?. రూ.3300 కోట్లు వస్తున్నాయనే పేరుతో ముందుగా రూ.371 కోట్లు ఇవ్వడం న్యాయమా?. అలానే ఈ నాలుగేళ్లలో 14 లక్షల మందికి  ట్రైన్ అయితే అన్ని కోట్లు ఖర్చు కాలేదే.. అప్పుడు మాత్రమే ఎందుకయ్యాయి. సీమెన్స్ కంపెనీ రూ.3300 కోట్లు, ఏపీ ప్రభుత్వానికి రూ.370 కోట్లు , కేంద్రానివి రూ.250 పెట్టుబడులు మొత్తం దాదాపు రూ.4000 కోట్ల ఉంటుంది.

ఇదంతా సామాన్యుడి దగ్గరకి రావాల్సిన ముద్దా లాగేసినట్లే గా?. అలాగే రూ.149 కే  కేబులు కనెక్షన్ వస్తుందనకుంటే.. ఆ డబ్బులూ తినేసి.. చివరకు కేబుల్ ఆపరేట్లను బెదిరించి.. వారి కనెక్షన్లలో కొన్నిటిని రూ.149 కి రాయించుకోవడం అన్నటువంటిది న్యాయమా?. ఇక్కడ కేబుల్ ఆపరేట్లకు అన్యాయం, సామాన్యుల ప్రజలకు అన్యాయం, విద్యార్థులకు అన్యాయం.. ఇన్ని అన్యాయాలలు చేసి న్యాయానికి సంకెళ్లు ఉద్యం చేస్తే.. నవ్వి పోదురుగాక” అంటూ జర్నలిస్ట్ సాయి పేర్కొన్నారు. మరి.. సాయి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి