iDreamPost
android-app
ios-app

శాంతా? అదెక్కడ JC గారూ ,

  • Published Dec 19, 2019 | 3:25 AM Updated Updated Dec 19, 2019 | 3:25 AM
శాంతా? అదెక్కడ JC గారూ ,

నిన్న అనంతపురం సభలో బాబు గారి సమక్షంలో జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ శాంతి శాంతి అని బాబు గారు తమ చేతులు కట్టేసారని వ్యాఖ్యానించారు .

బాబు గారి హయాంలో శాంతా అదీ మీ ఇలాకాలో ఎక్కడ జేసీ గారూ .

నందిగామలో మీ బస్సు ప్రమాదం కారణంగా పదకొండు మంది దుర్మరణం చెందితే యాజమాన్యం అయిన మీ మీద ఒక్క కేసు లేకుండా వ్యవహారం అంతా శాంతియుతంగా నడిచిపోయింది కదా కనుక బాబు గారు శాంతి దూతే .

2014 లో తమరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీ బస్సు తగలడి 40 మంది చనిపోతే నానాయాగీ చేసిన ఎల్లోమీడియా , ప్రత్యేకించి కొవ్వొత్తుల ర్యాలీ చేసిన టీవీ 9 రవిప్రకాష్ సహా అందరూ 2017 బస్సు దుర్ఘటన గురించి నోరు మెదపకుండా శాంతియుతంగా కట్టడి చేసినారు కదా కావున బాబు గారు శాంతిదూతలే .

మీ తమ్ముడు ప్రభాకర రెడ్డి గారు నడి రోడ్డు మీద కూర్చొని ప్రతిపక్ష నేత జగన్ ని సభ్యసమాజం వినలేని భాషలో బూతులు తిట్టింది కూడా శాంతియుతంగానే కదా సర్ . అందుకు సహకరించిన బాబు గారు శాంతి సాధకుడు .

తమరి ఇలాకాలో పాలిషింగ్ బ్లేడ్ కింత అని గ్రానైట్ , పలకల ప్యాక్టరీల దగ్గర మామూళ్ల దందా నిర్వహిస్తున్నారు అని లోలోన అనుకోవటమే తప్ప గట్టిగా ఒక్కరు కూడా బయటికి అనలేనంతగా శాంతియుతంగా అదుపు చేసే అవకాశం మీకిచ్చిన బాబు గారు శాంతి స్వరూపులే .

చివరికి ఎయిర్పోర్ట్ స్టాఫ్ మీద మీరు ప్రశాంతంగా చెయ్యి చేసుకొన్నా కూడా రాష్ట్రములోనే కాకుండా దేశవ్యాప్తంగా మీ పేరు చెప్పుకొనే విధంగా గజపతిరాజు గారి చేత కేసుల్లేకుండా రాజీ చేసిన శాంతికాముకులు బాబు గారు , కాదనగలమా .

మీరు అధికారములో ఉన్న ఐదు సంవత్సరాలలో మీ పార్టీకే చెందిన అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి,మేయర్ స్వరూప గారు మీ అనుచరులు వారు పనిచేసుకోకుండా అడ్డుకున్నారని,దౌర్జన్యం చేశారని మీకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు ధర్నా చేశారు?

మీకే ఇన్ని విషయాల్లో శాంతియుతంగా సహకరించిన బాబు గారు ఇంకా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీలో ఉన్న మీ బోటి ఉత్తమ సహనశీలురకు ఎంతమందికి ఎన్ని విధాలుగా సహాయం చేసి శాంతిసామరస్యాలు నెలకొల్పారో . ఇందుకుగాను శాంతి అవదూత నోబెల్ బాబు గారికిద్దాం . ఏంటి వాళ్ళు ఈయనకి ఇవ్వమన్నారా , భలేవారే వ్యవసాయంలో నోబెల్ మాత్రం వాళ్లిచ్చారా ఏంటీ , బాబు గారే ఇవ్వలా ఇదీ అలాగే ఇచ్చేద్దాం .

marsbahis girişjojobet girişjojobet