iDreamPost
android-app
ios-app

MLA రాజయ్యపై మరోసారి సంచనల ఆరోపణలు చేసిన సర్పంచ్‌ నవ్య!

  • Published Jun 21, 2023 | 1:25 PM Updated Updated Jun 21, 2023 | 1:25 PM
  • Published Jun 21, 2023 | 1:25 PMUpdated Jun 21, 2023 | 1:25 PM
MLA రాజయ్యపై మరోసారి సంచనల ఆరోపణలు చేసిన సర్పంచ్‌ నవ్య!

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు వివాదాలు చాలా కామన్‌. నిత్యం వివాదాల్లో ఆయన పేరు మారుమోగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జానకీపురం సర్పంచ్‌ నవ్య.. ఎమ్మల్యే రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. వివాదం అధిష్టానం దృష్టికి చేరడం.. విషయం కాస్త సీరియస్‌ కావడంతో.. ఎమ్యెల్యే రాజయ్య స్వయంగా సర్పంచ్‌ నవ్య ఇంటికి వచ్చి.. ఆమెకు మీడియా ముఖంగా క్షమాపణలు సైతం చెప్పాడు. దాంతో ఈ వివాదం సద్దుమణిగింది అని అంతా భావించారు. కానీ మరోసారి సర్పంచ్‌, ఎమ్మెల్యేల మధ్య విబేధాలు బయటపడ్డాయి.

వివాదం సద్దుమణిగింది అని అందరూ భావిస్తుండగానే.. మరోసారి సర్పంచ్‌ నవ్య షాకిచ్చింది. ఎమ్మెల్యే రాజయ్య తన కాపురంలో చిచ్చుపెడుతున్నాడని ఆరోపించింది. లైంగిక ఆరోపణలకు సంబంధించి ఆడియోలు టేపులు కావాలని.. అందుకోసం 20లక్షల రూపాయలు ఇస్తానని ఎమ్మెల్యే బేరాలు ఆడుతున్నారని మరోసారి బాంబు పేల్చింది సర్పంచ్‌ నవ్య. గ్రామానికి నిధుల పేరుతో డబ్బులిస్తూనే అప్పు కింద బాండ్ పేపర్‌పై సంతకం చేయాలంటున్నారని.. ఈ లాజిక్‌ ఏంటో తనకు అర్థం కావడం లేదని మండి పడింది.

ఈ విషయంలో ఎమ్మెల్యే ఒత్తిడితో తన భర్త కాంప్రమైజ్ కావాలంటూ తనను బలవంతం చేస్తున్నారని.. కానీ ఈ విషయంలో ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తానని తెలిపింది నవ్య. అయిపోయిందనుకున్న వివాదాన్ని మళ్లీ ఎందుకు తట్టిలేపారు అన్న అంశమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు రాజయ్యపై నవ్య ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది మరో ప్రశ్నగా కనిపిస్తోంది. నవ్య మాత్రం అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూనే తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేస్తుంది. ఇక ఈ వివాదంపై రాజయ్య ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş