iDreamPost
android-app
ios-app

మద్యనిషేధం–వెనక్కి తగ్గేది లేదంటున్న జగన్

మద్యనిషేధం–వెనక్కి తగ్గేది లేదంటున్న జగన్

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలో భాగంగా దశల వారీ మద్య నిషేదం విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే మాట ఇచ్చిన ప్రజల కోసం ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినడు అన్న చందంగా ఉన్నాయి. దీనిలో భాగంగా మద్యం ప్రియులకు షాక్ ఇస్తూ రేట్ల ను భారీగా పెంచడం తో పాటు దశల వారీ మద్య నిషేదం అమలులో భాగంగా రాష్ట్రంలో ప్రతి మూడు మద్యం షాపుల్లో ఒక షాప్ ను మూసివేసే దిశగా చర్యలు మొదలుపెట్టాడు.

దానిలో భాగంగానే మద్య నియంత్రణ, నిషేధంలో భాగంగా 13 శాతం మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బాబు హయాములో ఉన్న షాపుల సంఖ్య ను 20 శాతం కుదించినట్టైంది. 

బాబు హయాములో ఉన్న 4,380 మద్యం షాపులను 2,934 కి తగ్గిస్తూ (33 శాతం) రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 43 వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది.

మద్యం ప్రియులకు ఈ పరిణామాలు బాధగా ఉండొచ్చు కానీ మద్యం ధరలు 75 శాతం పెంచి ,ప్రతి మూడు షాపుల్లో ఒక షొప్ తీసేయడం తో మద్యం వినియోగం తగ్గడంతో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు

మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను జగన్ ప్రభుత్వం ఇప్పటికే 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలనికఠినమైన నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపింది.

రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం, ముందుగా బెల్ట్‌షాపులు ఎత్తివేస్తానంటూ పాదయాత్రలో హామీనిచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను ఏటా కొంతమేర తగ్గించేలా కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చారు. ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో నూటికి నూరుశాతం మద్యం దుకాణాలు ఎత్తివేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఇదంతా చూస్తుంటే ఎన్నికలకు ముందు భహిరంగ సభల్లో జగన్ చెప్పినట్టు.. మద్యం బాటిల్ పట్టుకోవాలంటె షాక్ కొట్టేవిధంగా ధరలు పెంచి మద్యం అలావాటు తగ్గిస్తా అన్న మాటలను తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆచరణ లో అమలు చేసి చుపెడుతున్నాడన్న విషయం జనంలొకీ వెళ్లిపోయింది. ఈ విషయం లో జగన్ కి అన్ని వర్గాల నుండి మద్దతు పెరిగింది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş