iDreamPost
android-app
ios-app

యూజీసీ చైర్మ‌న్ గా న‌ల్గొండ జిల్లా వాసి..!

యూజీసీ చైర్మ‌న్ గా న‌ల్గొండ జిల్లా వాసి..!

దేశంలోని విశ్వ‌విద్యాల‌యాల‌కు గుర్తింపును, గుర్తింపు పొందిన సంస్థ‌ల‌కు నిధుల‌ను అందించే యూనివ‌ర్సిటీ గ్రాంట్ క‌మిష‌న్ (యూజీసీ) చైర్మ‌న్ గా తెలంగాణ రాష్ట్రం న‌ల్గొండ జిల్లాకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు యూజీసీ చైర్మ‌న్ గా ఉన్న డాక్ట‌ర్ డీపీ సింగ్ ప‌ద‌వీవిర‌మ‌ణ చేయ‌డంతో ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు ఏర్పాటు చేసిన సెర్చ్ క‌మిటీ ముగ్గురి పేర్ల‌ను ప్ర‌స్తావించింది. వారిలో పుణె వ‌ర్సిటీ వీసీ డాక్ట‌ర్ నితిన్ క‌ల్మ‌ల్ క‌ర్, ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ యాక్స‌ల‌రేట‌ర్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ అవినాష్ పాండె, ప్ర‌స్తుతం ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాల‌యం వీసీగా కొన‌సాగుతున్న జ‌గ‌దీష్ కుమార్ ఉన్నారు. వారిలో జ‌గ‌దీష్ కుమార్ ను కేంద్రం ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రానికి చెందిన వ్య‌క్తికి అత్యంత గౌర‌వం ద‌క్క‌డంపై ప్ర‌శంస‌లు అందుతున్నాయి.

విద్యావేత్తగా గుర్తింపు పొందిన జ‌గ‌దీష్ కుమార్ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందినవారు. 1994 నుంచి 1995 వ‌ర‌కు ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్‌లో విజిటింగ్ ఫ్యాక‌ల్టీగా, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా బాధ్యత‌లు నిర్వహించారు. ఆ త‌ర్వాత 1997లో ఢిల్లీ ఐఐటీలోని ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్‌కు అసోషియేట్ ప్రొఫెస‌ర్‌గా వెళ్లారు. 2005లో ప్రొఫెస‌ర్‌గా ప్రమోష‌న్ పొందారు. ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ నిపుణులుగా ప్ర‌ఖ్యాతి గాంచారు. జేఎన్ యూఈలో 2016లో వివాదాలు చెల‌రేగిన స‌మ‌యంలో జ‌గ‌దీష్ కుమార్ ను అక్క‌డ వీసీగా నియ‌మించింది. అప్ప‌టి నుంచీ జేఎన్‌యూ వీసీగా ప‌ని చేస్తున్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 26తో ఆయ‌న ఐదేండ్ల ప‌ద‌వీ కాలం ముగిసినా త‌దుప‌రి వీసీని నియ‌మించే వ‌ర‌కు ఆయ‌న‌ను ఈ పోస్టులో కొన‌సాగిస్తున్నారు.

తాజాగా ఆయ‌నను యూజీసీ వీసీగా నియ‌మిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. యూజీసీ ఛైర్మన్ ప‌ద‌వి గ‌త ఏడాది డిసెంబ‌ర్ 7 నుంచి ఖాళీగా ఉంది. అప్పటివ‌ర‌కు యూజీసీ గ్రాంట్స్ క‌మిష‌న్ ఛైర్మన్‌గా ప‌నిచేసిన ప్రొఫెస‌ర్ డీపీ సింగ్ 65 ఏండ్ల వ‌యసు నిండ‌టంతో డిసెంబ‌ర్ 7న రిటైర్మెంట్‌ తీసుకున్నారు. జ‌గ‌దీష్ కుమార్ తో ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేసింది కేంద్రం.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet