iDreamPost
android-app
ios-app

గుర్తు పట్టలేకుండా మారిన జబర్దస్త్‌ వినోద్‌.. చేతబడి చేశారంటూ కామెంట్స్‌

  • Published Nov 16, 2023 | 9:04 AM Updated Updated Nov 16, 2023 | 9:04 AM

జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేస్తూ.. ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు వినోద్‌. ఆడవాళ్లే అసూయపడేంత అందంగా ఉండే వినోద్‌.. ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. కారణం ఏంటి అంటే..

జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేస్తూ.. ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు వినోద్‌. ఆడవాళ్లే అసూయపడేంత అందంగా ఉండే వినోద్‌.. ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. కారణం ఏంటి అంటే..

  • Published Nov 16, 2023 | 9:04 AMUpdated Nov 16, 2023 | 9:04 AM
గుర్తు పట్టలేకుండా మారిన జబర్దస్త్‌ వినోద్‌.. చేతబడి చేశారంటూ కామెంట్స్‌

బుల్లితెర మీద ప్రసారం అవుతోన్న బజర్దస్త్‌ కార్యక్రమం ద్వారా ఎందరో కొత్త ఆర్టిస్ట్‌లు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. వీరిలో ప్రస్తుతం చాలా మంది సినిమాల్లో రాణిస్తున్నారు. ఇక వేణు వంటి వారైతే.. మెగా ఫోన్‌ చేతబట్టి.. తమ టాలెంట్‌ను చాటుకుంటున్నారు. ప్రస్తుతం జబర్దస్త్‌ కార్యక్రమంలో యువతులు, సీరియల్‌ నటీమణులు పాల్గొంటున్నారు. కానీ ప్రారంభంలో ఈ షోలో స్త్రీ పాత్రల కోసం మగవారే లేడీ గెటప్‌ వేసేవారు. అలా పరిచయమైన వారిలో జబర్దస్త్‌ వినోద్‌ ఒకరు. చీరకట్టులో, మేకప్‌తో.. అమ్మాయిలా ఎంతో అందంగా కనిపిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రారంభంలో చాలా రోజుల పాటు.. వినోద్‌ని చూసిన వారు అమ్మాయే అనుకున్నారు. అంత అందంగా ఉండేవాడు. లేడీ గెటప్‌లతో ప్రేక్షకులను అలరించిన జబర్దస్త్‌ వినోద్‌ ప్రస్తుతం గుర్తుపట్టరానంతగా మారాడు. అందుకు గల కారణాలు వివరించాడు. ఆ వివరాలు..

జబర్దస్త్‌ వినోద్‌ గత కొంతకాలంగా తెర మీద కనిపించడం లేదు. ఈక్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వివరాలు వెల్లడించాడు. కొన్ని రోజుల క్రితం తాను అనారోగ్యానికి గురయ్యానని తెలిపాడు. అంతేకాక తనకు చేతబడి చేశారేమో అన్న అనుమానం కూడా కలిగిందని చెప్పుకొచ్చాడు. హాస్పిటల్‌ ఖర్చు, చేతబడి విరుగుడుకి కలిపి మొత్తం 3 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యిందని తెలిపాడు. ఇక తన పరిస్థితి తెలుసుకుని చాలా మంది తోటి నటులు.. అడగకుండానే వచ్చి తనకు సాయం చేశారని వెల్లడించాడు. వారంతట వారే వచ్చి తనకు సాయం చేయడం చూసి ఎంతో సంతోషించాను అన్నాడు.

ఇక గతంలో ఇంటి ఓనర్‌తో గొడవ అయిన సమయంలో తన చేయి విరిగిందని.. అలానే ఓ వ్యక్తికి హామీ ఉండటంతో ఐదు లక్షల రూపాయల వరకు నష్టపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు వినోద్‌. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని.. అంతా సెట్‌ అయిన తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌తో పాటు ఇతర ఈవెంట్స్‌ కూడా చేస్తానని చెప్పుకొచ్చాడు. అయితే తన మీద ఎవరో చేతబడి చేశారంటూ వినోద్‌ చేసిన కామెంట్స్‌ ప్రసుత్తం వైరల్‌గా మారాయి.

అమ్మాయిలే అసూయపడేంత అందంగా రెడీ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు వినోద్‌. ఇక గతంలో ఇంటి ఓనర్‌తో గొడవ సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. అతడి భార్యకు జబర్దస్త్‌ సెట్‌ మీదే సీమంతం చేశారు. మరోపక్క యూట్యూబ్‌ చానెల్ని కూడా రన్‌ చేస్తున్నాడు. షోలు, యూట్యూబ్‌ చానెల్‌లో వీడియలో పోస్ట్‌ చేస్తూ బాగానే ఉన్నాడు అనుకున్న సమయంలో ఇలా అనారోగ్యానికి గురై.. గుర్తు పట్టలేకుండా మారాడు. వినోద్‌ని ఇలా చూసిన వారు.. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom