iDreamPost
android-app
ios-app

Varsha: జబర్దస్త్ వర్షకు చేదు అనుభవం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి

  • Published Dec 30, 2023 | 12:08 PM Updated Updated Dec 30, 2023 | 12:26 PM

సాధారణంగా ఇండస్ట్రీలో నటి నటుల యాక్టింగ్ కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తూనే ఉంటాయి. అయితే, నటీ నటులు కేవలం ప్రశంసలనే స్వీకరిస్తే సరిపోదు. కొన్నిసార్లు విమర్శలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ క్రమంలో ఓ బుల్లితెర నటి తాను ఎదుర్కున్న పరిస్థితులపై విచారిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

సాధారణంగా ఇండస్ట్రీలో నటి నటుల యాక్టింగ్ కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తూనే ఉంటాయి. అయితే, నటీ నటులు కేవలం ప్రశంసలనే స్వీకరిస్తే సరిపోదు. కొన్నిసార్లు విమర్శలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ క్రమంలో ఓ బుల్లితెర నటి తాను ఎదుర్కున్న పరిస్థితులపై విచారిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

  • Published Dec 30, 2023 | 12:08 PMUpdated Dec 30, 2023 | 12:26 PM
Varsha: జబర్దస్త్ వర్షకు చేదు అనుభవం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి

సహజంగా సమాజంలో ప్రశంసించే వారు ఉంటారు.. వారితో పాటు విమర్శించే వారు ఉంటారు. ఏ రంగం అయినా ఈ రెండిటిని సమానంగా తీసుకోవాల్సి ఉంటుంది. నటీ నటుల విషయమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు నిత్యం ఎదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వెండితెర నటులకైనా, బుల్లి తెర నటులకైనా విమర్శలు, ప్రశంసలు అనేవి సహజం. అయితే, కొంతమంది నటులు మాత్రం వారిపై వచ్చిన విమర్శలకు ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో బుల్లితెరలో జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన నటి వర్ష.. తనకు ఎదురైన ఓ చేదు అనుభవంపై స్పందిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా వర్ష మంచి పేరును సంపాదించుకుంది. అయితే, తాజాగా ఈ నటి తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళింది. ఈ క్రమంలో ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. అది కూడా AAA థియేటర్ లో జరిగింది. ఆమె ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్ళింది. అక్కడ, తన కారును వాలెట్ పార్కింగ్ కు ఇచ్చింది. సినిమా చూసి తిరిగి వచ్చి, తన కార్ కోసం బయట వెయిట్ చేస్తున్న సమయంలో.. ఓ వ్యక్తి ఆమెపై దారుణంగా దుర్భాషలాడాడు. అతని ప్రవర్తన, అతని మాటలు ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయని, ఆ సమయంలో తానూ ఎంతో భయపడ్డాడని, ఆ పరిస్థితులు ఆమెను ఎంతగానో బాధించాయని.. వర్ష చెప్పుకొచ్చింది. ఆ సమయంలో అతనిని ఆమె తిరిగి ప్రశ్నించినట్టుకూడా తెలిపింది.

కానీ, అదే పరిస్థితి వేరే అమ్మాయికి ఎదురైతే.. దాని పరిణామం ఎలా ఉంటుంది? ఏ అమ్మాయైనా ఇలా అసభ్యకరంగా మాట్లాడితే ఎలా తీసుకోగలుగుతుంది? అందరిముందు పబ్లిక్ లో ఇలా ప్రశ్నించడం వలన చూసిన వారు ఏం అనుకుంటారు? అంటూ తాను పోస్ట్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చింది వర్ష. అంతేకాకుండా ఆ వ్యక్తి ఫోటో కూడా సామజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తానని చెప్పింది. అలాగే, ఇలాంటి పనులు ఇంకెవరు చేయొద్దంటూ.. ఆ పరిస్థితిలో ఎవరున్నా దానిని తీసుకోవడం కష్టం అంటూ.. వాపోయింది. ఇక, వర్ష విషయానికొస్తే ఆమె ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోస్ లో కూడా యాంకర్ గా చేస్తూ.. బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ భామ. మరి, వర్షకు ఎదురైనా చేదు అనుభవం గురించి తాను స్పందించిన విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabet