iDreamPost
android-app
ios-app

విలక్షణ నటుడి అభిమానులకు విందే

  • Published Sep 06, 2021 | 10:59 AM Updated Updated Sep 06, 2021 | 10:59 AM
విలక్షణ నటుడి అభిమానులకు విందే

గతంలో మన ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ సైరా, ఉప్పెన లాంటి సినిమాల పుణ్యమాని విజయ్ సేతుపతి టాలీవుడ్ లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఇమేజ్ ని మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు. హీరోగా కాకపోయినా ఆర్టిస్టుగా జనంలో మంచి గుర్తింపు వచ్చేసింది. అందుకే ఇతని కొత్త మూవీ ‘లాభం’ని ఈ నెల 9న తమిళంతో పాటు సమాంతరంగా తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని ట్రేడ్ రిపోర్ట్. సీటిమార్, తలైవిలతో పోటీ ఉన్నప్పటికీ లాభం మీద నమ్మకంతో నిర్మాతలు గట్టి ధైర్యం చేస్తున్నారు.శృతి హాసన్, జగపతిబాబు లాంటి క్యాస్టింగ్ ఉండటం దీనికి చాలా ప్లస్ అవుతోంది.

ఇతని మరో సినిమా ‘తుగ్లక్ దర్బార్’ నేరుగా సన్ టీవీలో డైరెక్ట్ ప్రీమియర్ కాబోతోంది. అది కూడా 10వ తేదీనే కావడం గమనార్హం. తెలుగు వెర్షన్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే రోజు టక్ జగదీష్ విడుదల ఉంది కాబట్టి కొన్ని రోజులు ఆగాక జెమినీలో ప్రసారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక రోజు గ్యాప్ తో నెట్ ఫ్లిక్స్ లోనూ అందుబాటులో తేబోతున్నారు. తాప్సీతో కలిసి నటించిన ‘అన్నాబల్లె సేతుపతి’ని 17వ తేదీ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఇది తెలుగు ఆడియోతో రాబోతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ హారర్ మూవీ లవర్స్ ని బాగానే ఆకట్టుకుంది. అంచనాలు కూడా పెరుగుతున్నాయి.

ఇలా ఒక మార్కెట్ ఉన్న హీరో సినిమాలు ఒకటి థియేటర్లో రెండు చిన్నితెరపై కేవలం పది రోజుల గ్యాప్ లో రావడం విజయ్ సేతుపతికి ఒకరకంగా రికార్డు అనే చెప్పాలి. మరో చిత్రం కడైసి వివసాయి కూడా ఓటిటి చర్చల్లో ఉందని చెన్నై న్యూస్. గత ఏడాది లాక్ డౌన్ లోనూ ఇతని కపే రణసింగం జీ ప్లెక్స్ లో డైరెక్ట్ గా వచ్చేసింది. తన నిర్మాతలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నందుకు విజయ్ సేతుపతి ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదట. మీకు ఏది లాభం అనిపిస్తే అది చేయండని వాళ్ళకే స్వేచ్ఛను ఇస్తున్నాడు. సో మక్కల్ సెల్వన్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ కన్ఫర్మ్ అయిపోయింది. వచ్చే నెల కూడా ఇంకో రెండు వచ్చే అవకాశాలు ఉన్నాయి

Also Read: మళ్ళీ సింగ్ టైటిల్ తో పవన్ ?

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet