iDreamPost
android-app
ios-app

దిగ్గజాల మధ్య డెబ్యూ హీరో గెలుస్తాడా?

  • Published Sep 27, 2022 | 10:58 AM Updated Updated Sep 27, 2022 | 10:58 AM
  • Published Sep 27, 2022 | 10:58 AMUpdated Sep 27, 2022 | 10:58 AM
దిగ్గజాల మధ్య డెబ్యూ హీరో గెలుస్తాడా?

అక్టోబర్ 5న చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ ల మధ్య బెల్లంకొండ గణేష్ డెబ్యూ మూవీ స్వాతిముత్యంని పోటీకి దింపడం పట్ల ట్రేడ్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతూనే ఉంది. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ లో ఓ సీనియర్ జర్నలిస్ట్ నిర్మాత నాగ వంశీని దీని గురించే అడిగితే తమది పెద్ద బ్యానరని, రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లతో సరిపడా థియేటర్లు దొరుకుతాయని, ఉదయం మధ్యాహ్నం ఆ రెండు చూసినా సాయంత్రానికి తమది బెస్ట్ ఛాయస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వినడానికి బాగానే ఉంది కానీ ఎలా చూసుకున్నా ఇది రిస్క్ కోణమే. ఎందుకంటే బెల్లంకొండ గణేష్ ని అర్జెంట్ గా తెరమీద ఎప్పుడెప్పుడు చూద్దామన్న ఆత్రం ప్రేక్షకుల్లో లేదు.

సితార పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలతో తీసి ప్రస్తుతం మహేష్ బాబుతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేస్తున్న సంస్థ కాబట్టి బయ్యర్ల విషయంలో ఇబ్బందులు ఉండకపోవచ్చు. అంత మాత్రాన ఫలానా వాళ్ళు తీశారు కదా ఓసారి వెళ్దామనుకునే ట్రెండ్ కాదిది. ఉదయం ఆటకు సోసో టాక్ వస్తే అది దిల్ రాజు నిర్మాణమైనా సురేష్ బాబు సపోర్ట్ అయినా నిర్మొహమాటంగా తిరస్కారం ఎదురవుతోంది. పోనీ స్వాతిముత్యంలో ఏమైనా ఎక్స్ ట్రాడినరీ కంటెంట్ ఉందా అంటే సింపుల్ సెటప్ తో క్లీన్ రామ్ కామ్ కామెడీని సెట్ చేసినట్టు కనిపిస్తోంది. హిలేరియస్ గా ఉంటే తప్ప ఇలాంటి వాటికి అంత ఈజీగా జనం కదలరు. నాని,నాగశౌర్యలకే ఇది తప్పలేదు.

మొత్తానికి స్వాతిముత్యం ధైర్యం ఏంటో తెలియాలంటే అక్టోబర్ 5 దాకా వేచి చూడాలి. గణేష్ ని తామేమి లాంచ్ చేయడం లేదని అమాయకుడైన మొహం కావాలంటే ఇతను దొరికాడని తీరా చూస్తే బెల్లంకొండ సురేష్ అబ్బాయని తెలిసిందని చెప్పిన వంశీ మొత్తానికి చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. హీరోయిన్ వర్ష బొల్లమకు సైతం ప్రత్యేకంగా ఇమేజ్ అంటూ ఏమి లేదు. ఎంత టాలెంట్ ఉన్నా పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. తన ఆశలన్నీ స్వాతిముత్యం మీదే ఉన్నాయి. బరిలో మంచు విష్ణు జిన్నా ఉండటం డౌటే అంటున్నారు కాబట్టి ఈ ట్రయాంగిల్ వార్ ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ వారం ముందు వచ్చే పొన్నియన్ సెల్వన్ 1కు హిట్ టాక్ వస్తే మరింత ఇబ్బంది తప్పదు

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş