Ram Charan : వెంకీ చైతు రానాల తర్వాత చరణేనా

ప్రపంచవ్యాప్తంగా గొప్ప పాపులారిటీ ఉన్న నెట్ ఫ్లిక్స్ ఇండియాలోనే కొంత వీక్ గా ఉండటాన్ని స్వయానా ఆ కంపెనీ సిఈఓ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సబ్స్క్రిప్షన్ ధరలు కూడా తగ్గించి ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయినప్పటికీ సగటు మధ్యతరగతి జీవికి నెట్ ఫ్లిక్స్ చందా ఖరీదైన వ్యవహారమే. అందుకే తమ బ్రాండ్ ని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు ఈ సంస్థ కొత్త ప్రణాళికలతో ముందడుగు వేస్తోంది. విక్టరీ వెంకటేష్ రానాలో కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రానా నాయుడు వెబ్ సిరీస్ కీలక భాగం ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ ఏడాదే రిలీజవుతోంది.

ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఓ కొత్త సిరీస్ కోసం ఒప్పించేందుకు నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేసినట్టు ఓటిటి వర్గాల సమాచారం. ఇందుకు గాను పాన్ ఇండియా లెవెల్ లో వందల కోట్ల బడ్జెట్ కు సైతం సిద్దపడ్డారుట. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ డీల్ చేయబోయే ఈ ప్రాజెక్ట్ ఇండియాలోనే మోస్ట్ కాస్ట్లీ సిరీస్ గా ఉండబోతోందనేది ఇన్ సైడ్ టాక్, అయితే చరణ్ ఈ ప్రతిపాదనకు ఎలా స్పందించాడనేది ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్న ఈ మెగా హీరోకీ ఆ తర్వాత కూడా కమిట్ మెంట్స్ ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి, ప్రశాంత్ నీల్ ఇలా క్రేజీ కాంబినేషన్లన్నీ లైన్ లో ఉన్నాయి

ఓటిటి వెబ్ సిరీసా అని తక్కువ అంచనా వేయడానికి లేదు. సూర్య, విజయ్ సేతుపతి లాంటి నోటెడ్ ఆర్టిస్టులు ఆల్రెడీ ఈ లీగ్ లో ఉన్నారు. నాగ చైతన్య ప్రత్యేకంగా ఒక హారర్ సిరీస్ చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్ కు దూత అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఒకవేళ చరణ్ కనక వెబ్ కి ఓకే చెబితే అదో పెద్ద సెన్సేషన్ అవుతుంది. చూస్తుంటే తన యాప్ కి జనం ఆకర్షితులు కావడం కోసం ఎంత ఖర్చైనా సిద్ధపడేందుకు ఇలాంటి ఓటిటిలు రెడీ అవుతున్నాయి. ఇప్పటిదాకా మెగా హీరోలు ఎవరూ వెబ్ సిరీస్ చేయలేదు. ఆర్ఆర్ఆర్ తో నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న చరణ్ నిజంగానే ఇది చేస్తాడంటారా

Also Read : Khiladi : మాస్ అంటే మసాలా ఒకటే కాదు

Show comments