iDreamPost
android-app
ios-app

కరోనాతో దావూద్‌ ఇబ్రహీం మృతి..! నిజ‌మేనా..? లేక పుకార్లా..?

కరోనాతో దావూద్‌ ఇబ్రహీం మృతి..! నిజ‌మేనా..?  లేక పుకార్లా..?

మోస్ట్‌ వాటెండ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు ఇటీవ‌లి కరోనా వైరస్ సోకింది. అయితే ఆయ‌న క‌రోనా వైర‌స్‌తో మృతి చెందాడన్న వార్తలు సోషల్‌ మీడియాలో షికారు చేస్తున్నాయి. 1994 నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలో ఐఎస్‌ఐ ఆశ్రయంలో ఉంటున్న దావూద్‌, అతడి భార్య మెహజబీన్‌ కరోనా బారిన పడి కరాచీ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా బారిన పడి ఆయన మృతి చెందాడని న్యూస్‌ ఎక్స్‌ మీడియా సంస్థ శనివారం ట్విట్ట‌ర్‌లో ఓ కథనాన్ని ప్రచురించింది. వైరస్‌ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దావూద్‌ మృతి చెందాడని పేర్కొంది. ఈ వార్త కాస్తా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌‌ అవుతోంది.

అయితే దావూద్‌ మృతిపై సరైన సమాచారం లేకపోయినా.. వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విపరీతంగా కామెంట్స్‌ పెడుతున్నారు. భారత్‌తో సహా ప్రపంచ దేశాలు చేయలేని పనిని కరోనా వైరస్‌ చేసిందని వ్యంగ్యంగా పోస్ట్‌ చేస్తున్నారు. కాగా వందలాది మంది ప్రాణాలను బలిగొన్న 1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ ఇబ్రహీం ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాడు.

దావూద్ కి, ఆయ‌న భార్య‌కు క‌రోనా సోక‌డంతో దావుద్ సిబ్బందిని కూడా క్వారెంటైన్‌లో ఉంచినట్లు ముందే నివేదించబడింది. అయితే, అతని దావుద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం మాట్లాడుతూ దావూద్, అతని కుటుంబ సభ్యులు ఎవరూ క‌రోనా పాజిటివ్ లేదని, వారందరూ తమ ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇంతలో శనివారం ఉదయం పాకిస్తాన్ లో క‌రోనాతో దావూద్ మరణించాడని కొన్ని మంది సోషల్ మీడియాలో పుకార్లు ప్ర‌చారం చేశారు. అయితే దావుద్ మ‌ర‌ణించార‌ని ఇండియాకు చెందిన న్యూస్ ఎక్స్ ఛానల్ ట్విట్ చేసింది. అయితే దీనిపై స్ప‌ష్ట‌త లేన‌ప్ప‌టికీ ఇదివ‌ర‌కే అనేక సార్లు దావుద్ ఇబ్ర‌హీం మ‌ర‌ణించార‌ని పుకార్లు వ‌చ్చాయి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet